పునరుద్ధరణతోనే సరి..! | The first phase of the interest waiver Not enough | Sakshi
Sakshi News home page

పునరుద్ధరణతోనే సరి..!

Jul 23 2015 1:04 AM | Updated on Jun 4 2019 5:04 PM

పునరుద్ధరణతోనే సరి..! - Sakshi

పునరుద్ధరణతోనే సరి..!

ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణం పుట్టడం లేదు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణం పుట్టడం లేదు. రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకులన్నీ వారి నుంచి వడ్డీ కట్టించుకుని రుణాలను పునరుద్ధరిస్తున్నాయి తప్ప కొత్తగా పైసా మంజూరు చేయడం లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెంచకపోవడమే. ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తారు.

ఈ పంటకు ఎకరాకు గతేడాది రూ.20 వేలు రుణ పరిమితి ఉండగా ఈ ఏడాది అంతే కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకులు ఒక్క పైసా అదనంగా రుణం మంజూరు చేయడం లేదు.
 
తొలి విడత మాఫీ వడ్డీలకే సరిపోలేదు..
ప్రభుత్వం రుణమాఫీ పేరుతో తొలి విడత ఇచ్చిన 20 శాతం నిధులు రైతుల అప్పులపై వడ్డీ చెల్లింపునకే సరిపోలేదు. దీంతో రైతులు మిగతా బకాయిలపై వడ్డీ చెల్లిస్తే గానీ వారి రుణాలు పునరుద్ధరించే పరిస్థితి లేదు. దీంతో బ్యాంకులే రంగంలోకి దిగి వడ్డీ చెల్లించి రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలని, లేదంటే వడ్డీ భారం పెరిగిపోతుందంటూ రైతులకు నచ్చచెబుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటి వరకు రూ.15 వేల కోట్ల రుణాలను వడ్డీ కట్టించుకుని రెన్యువల్స్ చేశాయి.

దీనికోసం వారు ప్రైవేట్  వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీ చెల్లిస్తున్న రైతులకు రుణం రెన్యువల్ అవుతోంది తప్ప కొత్తగా  పైసా  అందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా రుణ పరిమితిని పెంచకపోవడమేనని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. రుణ పరిమితి పెంచి ఉంటే కొంత ఇచ్చేందుకు వీలుండేదటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 20 శాతం నిధులతో మాఫీ చేయగా మిగిలిన  80 శాతం రుణంపై వడ్డీ ఎవరు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల ప్రతినిధులు కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పలేదు. దీంతో బ్యాంకులు అన్నదాతల నుంచే వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించాయి. రైతులకు నచ్చచెప్పి వడ్డీని కట్టించుకుని రుణాలను తిరిగి రెన్యువల్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement