తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది.
సాంకేతిక లోపంతో నిలిచిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
Jan 25 2016 11:05 AM | Updated on Jul 11 2019 6:33 PM
భువనగిరి: తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు నిలిచిపోయింది. సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన రైలు 10.30 గంటల సమయంలో ఇంజన్ లో సమస్య వచ్చింది. వెంటనే గుర్దించిన డ్రైవర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వేరే ఇంజన్‌తో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌ను భువనగిరి స్టేషన్‌కు తీసుకొచ్చి మరమ్మతులు చేపట్టారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ పునరుద్ధరణకు మరో అరగంటపాటు సమయం పడుతుందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
Advertisement
Advertisement