విశాఖ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది.
మహారాణిపేట: విశాఖ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని గేట్లను మూసివేశారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్యుద్ధం, తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలను ఝుళిపించారు. విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.