రూ. 52 లక్షల విలువైన గంజాయి స్వాధీనం | Rs . 52 Lakhs worth of marijuana seized | Sakshi
Sakshi News home page

రూ. 52 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Feb 8 2016 10:52 AM | Updated on May 3 2018 3:17 PM

రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన 2 టన్నుల గంజాయితో పాటు అక్రమంగా కారులో తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన 2 టన్నుల గంజాయితో పాటు అక్రమంగా కారులో తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం జమ్మిలి గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా గంజాయి నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని తరలించడానికి యత్నిస్తున్న ఏడుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో కారులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 52 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement