కర్నూలు జిల్లాలో వ్యభిచార గృహాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు.
మంత్రాలయం : కర్నూలు జిల్లాలో వ్యభిచార గృహాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. మంత్రాలయంలోని ఓ లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను , ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేశారు. లాడ్జీ నిర్వహకులను విచారిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.