నోకియా 6.2పై రూ.10వేల ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

Nokia 6.2 With Triple Rear Cameras Launched in India - Sakshi

సాక్షి, ముంబై: నోకియా  మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఎ టెక్ ఫెయిర్‌లో మొదట హెచ్‌ఎండి గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది.  మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో నోకియా 6.2 పేరుతో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో  వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ లాంటివి  ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

భారతదేశంలో నోకియా 6.2 ధర
4జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 15,999.  అమెజాన్‌లో  నోకియా 6.2 (సిరామిక్ బ్లాక్ వెర్షన్ ) అమ్మకాలు  మొదలయ్యాయి.

ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 2,000 రూపాయలు క్యాష్‌బ్యాక్‌. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే 10,100 వరకు ఆఫర్‌ను అందిస్తోంది. 

నోకియా 6.2 ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 9   పై
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 సాక్‌
4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌
512 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 
16+ 5 + 8 ఎంపీ  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top