కొయ్యలగూడెంలో మారిషస్ మంత్రి పర్యటన | mauritius minister visits nalgonda distirict | Sakshi
Sakshi News home page

కొయ్యలగూడెంలో మారిషస్ మంత్రి పర్యటన

Sep 25 2015 11:20 AM | Updated on Oct 16 2018 2:36 PM

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామాన్ని మారిషస్ దేశ ఆర్థిక, సామాజిక మంత్రి పృథ్వీరాజ్‌సింగ్ రూపేన్ శుక్రవారం సందర్శించారు.

చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామాన్ని మారిషస్ దేశ ఆర్థిక, సామాజిక మంత్రి పృథ్వీరాజ్‌సింగ్ రూపేన్ శుక్రవారం సందర్శించారు. గ్రామంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతున్న వస్త్రాలను పరిశీలించారు. కార్మికుల సమస్యల గురించి తెలుసుకున్నారు. మారిషస్‌లో చేనేత వస్త్రాల అమ్మాకానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం స్థానిక మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ సుధాకర్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement