
గ్రామజ్యోతిలో పాల్గొన్న గవర్నర్
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామంలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్ పాల్గొన్నారు.
షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామంలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్ పాల్గొన్నారు. సోమవారం ఆయన మంత్రి కేటీఆర్‌తో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటున్నారా..వైద్యులు ఎక్కడి నుంచి వస్తున్నారో గవర్నర్ ఆరా తీశారు. గ్రామంలో వ్యాధుల నివారణ ఎలా ఉందో అడిగి తెలసుకున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కార్యకర్తల పని తీరును కూడా గవర్నర్ ఈ సందర్భంగా పర్యవేక్షించారు.