తిరుమల శ్రీవారి దర్శనానికి సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 53,371 మంది భక్తులు దర్శించుకున్నారు.
మాడవీధుల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తి
సోమవారం కైశిక ద్వాదశి పురస్కరించుకుని తెల్లవారుజామునే ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే, ఉదయం 9 గంటలకు చక్రతీర్థ ముక్కోటి ఉత్సవం ప్రారంభమైంది. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రతీర్థం వద్ద తీర్థానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.