మోదీ మతోన్మాది: చాడ | chada venkat reddy slams prime minister | Sakshi
Sakshi News home page

మోదీ మతోన్మాది: చాడ

Feb 19 2016 12:31 PM | Updated on Sep 3 2017 5:58 PM

దేశద్రోహం ఆరోపణల కింద అరెస్టు అయిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ ను విడుదల చేయాలంటూ..

హైదరాబాద్: దేశద్రోహం ఆరోపణల కింద అరెస్టు అయిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్  ను విడుదల చేయాలంటూ సీపీఐ రాజ్ భవన్  ముట్టడికి యత్నించింది. శుక్రవారం ఉదయం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాడ మాట్లాడుతూ ప్రధాని మోదీ మతోన్మాది అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు. కన్హయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement