ఆటో ఢీకొని చిన్నారి మృతి | auto Collided child died in vikarabad | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని చిన్నారి మృతి

Nov 1 2015 1:48 PM | Updated on Mar 28 2018 11:11 AM

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆటో ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది.

వికారాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆటో ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని కొత్తగడిలో జరిగింది.

కాలనీకి చెందిన శ్రావణి(8) అనే చిన్నారి ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న ఆటో శ్రావణిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి మృతితో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement