ఏపీ రాజధాని శంకుస్థాపన పనుల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
విజయవాడ : ఏపీ రాజధాని శంకుస్థాపన పనుల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ ప్రధానితో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లుపై చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఏలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా శంకుస్ధాపన కార్యక్రమం సజావుగా చేయడానికి అన్ని శాఖల వారు సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు అధికారులను కోరారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణతోపాటు పలు కీలక అంశాలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.