హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎంఆర్ రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటులో ఉత్పత్తి మంగళవారం ప్రారంభమైంది.
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎంఆర్ రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటులో ఉత్పత్తి మంగళవారం ప్రారంభమైంది. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్‌కు అవసరమైన విద్యుత్‌లో 30 శాతం ఈ ప్లాంటు సమకూరుస్తుంది. రెండు మూడేళ్లలో ప్లాంటు సామర్థ్యాన్ని 30 మెగావాట్లకు చేర్చాలన్నది కంపెనీ ప్రణాళిక. తద్వారా విమానాశ్రయంతోపాటు అనుబంధంగా ఉన్న భవనాలకు మొత్తం విద్యుత్ సోలార్ ప్లాంటు అందిస్తుంది.