బస్సును ఢీకొట్టిన లారీ: 15 మందికి గాయాలు | 4 injured in road accident | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొట్టిన లారీ: 15 మందికి గాయాలు

Dec 2 2015 9:21 AM | Updated on Aug 30 2018 3:56 PM

మెదక్ జల్లా పటాన్ చెరు ప్రాంతంలో ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి.

పటాన్‌చెరువు: మెదక్ జల్లా పటాన్ చెరు ప్రాంతంలో ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది  ప్రయాణికులకు గాయాలయ్యాయి. పటాన్‌చెరు బస్టాండ్ ఎదుట బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో పటాన్‌ చెరు బస్టాండ్‌లోకి వెళ్లి తిరిగి బయటకు వస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముంబాయి వైపు వెళ్తున్న వేగంగా వచ్చిన లారీ, బస్సును ఢీకొట్టింది.
 
ప్రమాదం జరిగినప్పడు బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనతో పటాన్ చెరు రహదారిపై భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.  బస్సులో కూర్చొని క్షణ కాలం కాకముందే జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement