తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
Jan 14 2016 1:11 PM | Updated on Aug 30 2018 3:58 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి వైపు వెళ్తున్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గండేపల్లి పట్టణానికి చెందిన నిమ్మలపూడి వినోద్( 18), నిమ్మలపూడి ప్రసాద్(43) గా గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


