రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తూనే ఉంది. తాజాగా డెంగీతో ఇద్దరు మరణించారు.
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగీ విజృంభిస్తూనే ఉంది. తాజాగా డెంగీతో ఇద్దరు మరణించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పుచవటపాలెంనకు చెందిన కాయ్‌కాకుల రాజయ్య(39) అనే వ్యక్తి డెంగీ తో మృతి చెందాడు. ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. మరో వైపు తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో గ్రామంలో శ్రీరాముల నాగదుర్గ(7) అనే చిన్నారి డెంగీతో 5 రోజులుగా బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.