ఈసీ.. సీసీ.. ఇక ఈజీ

ec and cc easy with online registration website - Sakshi

గుంటూరు, సత్తెనపల్లి: రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్త్రాల నకళ్లు, లావాదేవీలు తెలుసుకునేందుకు ఇన్‌కంబరెన్స్‌ (ఈసీ) కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కాస్త కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దే పొందవచ్చు. రూ.కోట్ల ఆదాయాన్ని వదులుకొని రిజిస్ట్రేషన్స్, అండ్‌ స్టాంపుల శాఖ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈసీకి రూ.225, దస్తావేజుల నకళ్లకు రూ.270 చెల్లించవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్‌లోకి వెళ్లి  registration.ap.gov.in  అని టైప్‌ చేస్తే ఏపీ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌ ప్రత్యేక్షమవుతుంది. వెబ్‌సైట్‌ కింది భాగంలో కుడివైపున న్యూ సర్వీస్‌లో ఆన్‌లైన్‌ ఈసీ, ఆన్‌లైన్‌ సీసీ, దస్త్రాల ప్రిపరేషన్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిపై క్లిక్‌ చేస్తే యూజర్‌ ఐ.డి. పాస్‌వర్డ్‌ ఆప్షన్లు వస్తాయి. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పొందడానికి నాట్‌ మెంబర్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి పేరు, ఆధార్‌ నంబర్, అడ్రస్‌తో పాటు మనకు నచ్చిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చి సబ్‌మిట్‌ చేయాలి. అనంతరం లాగిన్‌ అయ్యి మనకు కావల్సిన సర్వీస్‌ను ఎంచుకోవాలి.

పబ్లిక్‌ ఆన్‌లైన్‌ సర్వీసులు..
యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కాగానే పబ్లిక్‌ ఆన్‌లైన్‌ పేరుతో నాలుగు సర్వీసులు కనిపిస్తాయి. దస్త్రాల రిజిస్ట్రేషన్, ఇన్‌కంబరెన్స్‌ (ఈసీ) సర్టిఫైడ్‌ కాపీ (దస్త్రాల నకళ్లు), రిజిస్ట్రేషన్‌ కావాల్సిన సర్వీస్‌పై క్లిక్‌ చేసి పూర్తి వివరాలను నింపి సబ్‌మిట్‌ చేయాలి.
ఇన్‌కంబరెన్స్‌ (ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ(నకళ్లు) సేవలు మాత్రం ప్రస్తుతం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల మధ్యనే పొందాలి.
ఫ్రీ రిజిస్ట్రేషన్‌ దస్త్రాల ప్రిపరేషన్‌కు మాత్రం ఆధార్, పాన్‌కార్డు వివరాలు తప్పనిసరిగా ఉండాలి.
దస్త్రాల ప్రిపరేషన్‌లో ఒకమారు తయారు చేసుకున్న దస్త్రాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top