1998 డిఎస్సీ అభ్యర్థులను ముంచుతారా?

Will The  KCR Do Justice To The 1998 DSC Candidates - Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో 1998లో డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు వారికి జరిగిన అన్యాయం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సమయంలో  కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ 2015 జనవరి 11న వరంగల్‌ జిల్లా పర్యటనలో మాట్లాడుతూ 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి జగదీష్‌ రెడ్డికి ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ పసునూరి దయాకర్‌ ఇదే విషయం చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ముఖాముఖీ చర్చిం చారు. అన్యా యం జరిగిందని సీఎం స్వయంగా ప్రకటించారు. హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు మంత్రి, విద్యాశాఖ అధికారులు తిరకాసులు పెడుతూ సీఎంనే తప్పు తోవ పట్టిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 1998 డిఎస్సీ లో నోటిఫికేషన్‌ విడుదల అయిన తరువాత, నిబంధనలకు విరుద్ధంగా, అర్హత మార్కులను 5 వరకు తగ్గించి, మరల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిపించి, వారికి ఉద్యోగం ఇచ్చారు. తెలం గాణ ప్రభుత్వంలోని 40 మంది ఎన్నికయిన శాసనసభ సభ్యులు, 6 గురు ఎమ్మెల్సీలు, 6గురు పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, 10 ఉపాధ్యాయ సంఘాలు 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. బుధవారం సీఎం కేసీఆర్, ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘ సభ్యులతో చర్చలు జరిపిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ముంచుతారా, తేలుస్తారా, ఇచ్చిన హామీలను (సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించి) అమలు చేస్తారా అని 1,500 మంది క్వాలిఫైడ్‌ టీచర్ల కుటుంబాలు ఆశలు పెట్టుకుంటున్నారు.

  రాజేష్‌ రావుల, లెక్చరర్, కరీంనగర్‌
  మొబైల్‌ : 98488 11424 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top