ఇంగ్లిష్‌ వ్యతిరేకులు పేదల శత్రువులు

Jupudi Prabhakara Rao Article On English Medium Introducing In AP - Sakshi

సందర్భం

ఈనాడు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచీ ప్రాథమిక విద్యా స్థాయి నుంచీ ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లిష్‌ మీడియంను వ్యతి రేకిస్తున్న వారందరూ, వారి పూర్వీకులూ లేదా వారి వారసులూ ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువు కున్నారనీ, చదువుకుంటున్నారనీ బహుజన పేద లందరికీ తెలుసు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, మద్రాసు, గుంటూరు, విజయవాడ, బందరు, రాజమండ్రి... తదితర ప్రఖ్యాత విద్యా కేంద్రా లలో అటు ప్రొటెస్టంట్, ఇటు క్యాథలిక్‌ విద్యా సంస్థలలో ఇంగ్లిష్‌ విద్యను నేర్చుకున్నవారే తొలి తరం జాతీయ నాయకులు, విద్యావేత్తలు, మేధా వులు, శాస్త్ర సాంకేతిక నిపుణులు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎన్నారైలు, రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలకు పైబడిన తెలుగువారు విదేశాల్లో నేడు స్థిర పడ్డారంటే అది మెకాలే ఆంగ్ల విద్య, క్రైస్తవ మిష నరీ విద్యా సంస్థల చలవేనని గుర్తుంచుకోవాలి.

బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు... వంటి జాతీయ పార్టీల ఒకప్పటి, ఇప్పటి ఉన్నత శ్రేణి కురువృద్ధ నాయకులందరూ క్రైస్తవ మిషనరీ, మెకాలే ఆంగ్ల విద్యా విధానంలోనే చదివినవారు. అదే విధంగా టీడీపీ, జనసేన లాంటి ఆంధ్ర పార్టీల నాయకులు, వారి పిల్లల పరిస్థితి కూడా. ఈ పార్టీలలోనే ధనికులు, కొందరు ప్రైవేటు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, కాలేజీలు నడుపు కుంటూ తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ భాషలోనే మునక లేయిస్తూ తెలుగుభాష మరణశయ్యపై ఉందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. బహుజన పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ భాషా జ్ఞానం అందకూడదని పన్నాగం పన్నుతున్నారు.

జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞా నమంతా ఇంగ్లిష్‌లోనే ఉంది. సాఫ్ట్‌వేర్, ఇన్ఫర్మే షన్‌ టెక్నాలజీ, మెడిసిన్, ఐఐటీ, ఐఐఎం, స్పేస్‌ సైన్స్, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్‌.. వంటి అగ్రశ్రేణి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విద్యను దేశంలోనూ, అమెరికా, ఇంగ్లండ్‌లోనూ ఇంగ్లిష్‌ లోనే బోధిస్తారు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర సాంకే తిక నిపుణులుగా ఎదగాలంటే 1వ తరగతి నుంచీ ఇంగ్లిష్‌ విద్య పునాది ఉండాలి. నేటి పోటీ ప్రపం చంలో ఇది తప్పనిసరి. లేకపోతే ఆయా శాస్త్ర సాంకేతిక వృత్తి విద్యా పదాలను తెలుగులోనే నేర్చుకొని ఉన్నత స్థాయిలో విద్యాభ్యాస సమ యంలో ఇంగ్లిష్‌లో అర్థం చేసుకోవడం కష్టమై చదువు మధ్యలో ఆపేయడం లేదా వెనుకబడి పోవడం వంటి దుస్థితిలో బహుజన విద్యార్థులు చిక్కుకుంటారు. యూనివర్సిటీ స్థాయి ఉన్నత విద్యలో ఇంగ్లిష్‌ మీడియం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) 12.4 శాతం మాత్రమే మన దేశం సాధించింది. ప్రపంచ సగటులో ఇది సగ భాగం మాత్రమే. ఇక గ్రామీణ దళిత యువత జీఈఆర్‌ 6 శాతం ఉంటే, అత్యంత దయనీయంగా 2 శాతం దళిత యువ మహిళల శాతం ఉంది.

మహాత్మ పూలే, పెరియార్, డాక్టర్‌ అంబేడ్కర్‌ లాంటి ఎందరో భారతీయ మేధావులు జ్ఞానాన్ని పొందేందుకు భాషను ఒక సాధనంగా భావిం చారు. విద్య పొందాలంటే భాష ఒక మాధ్యమ మేనని విశ్వసించారు. మరి అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని విద్య ద్వారా పొందాలంటే, అది ఇంగ్లిష్‌ భాష ద్వారానే సాధ్యమౌతుంది. ఈ మహనీయుల విద్యా తత్వశాస్త్రాన్ని గుర్తించి, గౌర వించి, ఆచరించిన ముఖ్యమంత్రి జగన్‌ క్రాంత దర్శి, రాజనీతిజ్ఞుడు, రాజకీయ కోవిదుడు.

పూలే, పెరియార్, అంబేడ్కర్, అనేక బహు జన మేధావులు భావిస్తున్నట్లు, సూచిస్తున్నట్లు ఇక ఇంగ్లిష్‌ ఎంతమాత్రమూ భాష కాదు, కానేకాదు, కానేరదు. ఇంగ్లిష్‌ ఒక జ్ఞానం, ఒక నైపుణ్యం. ఇంగ్లిష్‌ పునాది లేకపోతే బహుజన పేద వర్గాల విద్యార్థినీ, విద్యార్థులు నైపుణ్యం, జ్ఞానం లేని కార్మికులుగానే ఉండిపోతారు. ఇదే ఇంగ్లిష్‌ వ్యతి రేకించేవారి కుటిల రాజనీతి. అందుకే బహుజన పేద విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఆంగ్ల విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధిపత్య ధనిక వర్గ పార్టీలూ, వాటి నాయకులూ బహుజన పేదల శత్రువులని ప్రకటించాల్సిన సందర్భం నేడు తెలుగు ప్రజల ముందుంది. ఇంగ్లిష్‌ను కాపాడు కుందాం! ఇంగ్లిష్‌ మనల్ని కాపాడుతుంది!!
(నేడు తిరుపతిలో ‘పేద ప్రజలు, ప్రభుత్వం, ఆంగ్ల విద్య’ అంశంపై సెమినార్‌ సందర్భంగా)

జూపూడి ప్రభాకరరావు
వ్యాసకర్త వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్, మొబైల్‌ : 90148 63300 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top