బ్యాంకుల ‘లీగల్‌ దోపిడీ’

Banks Minimum Balance Rule Affecting People - Sakshi

ప్రస్తుతం దొంగాలకన్నా బ్యాంకులను చూస్తేనే ప్రజలకు ఎక్కువ భయం వేస్తోందంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది బ్యాంకులు అపరాధ రుసుము పేరుతో ప్రజల దగ్గర వసూల్‌ చేసిన మొత్తం అక్షరాలా ఐదు వేల కోట్ల పై మాటే. చట్ట వ్యతిరేకంగా ఒక మనిషి నుంచి మరో మనిషి సొమ్మును కాజేయడాన్ని ‘‘దొంగతనం’’ అంటారు, మరి రూల్స్‌ పేరు చెప్పి దోచుకోవడాన్ని ‘‘లీగల్‌ తెఫ్ట్‌’’ అనే కదా అనాలి..! ఎస్‌బీఐ ఇదే ఆర్థిక సంవత్సరం రూ. 6,547కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఆ నష్టంలో దాదా పు సగాన్ని మినిమం బాలన్స్‌ నిబంధన కిందనే వినియోగదారుల జేబునుంచి వసూలు చేసుకుంది. ఇలా అన్ని జాతీయరంగ బ్యాంకులలో అన్నింటికన్నా ఎక్కువగా వసూలు చేసింది ఒక్క ఎస్బీఐ మాత్రమే. దేశ వ్యాప్తంగా ఉన్న 3 పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు, 27 ప్రైవేట్‌ బ్యాంకులు ఒక్క మినిమం బాలన్స్‌ ఉంచడం లేదనే సాకుతోనే వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయి.  సత్వరమే కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే మోదీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగలక తప్పదు.
శ్రీనివాస్‌ గుండోజు,
ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ ‘ 99851 88429

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top