వారఫలాలు (మే 3 నుంచి 9 వరకు)

Weekly Horoscope 3rd May To 10th May  - Sakshi

మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అ««ధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం : (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. వివాహాది వేడుకల నిర్వహణకు సన్నద్ధమవుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మధ్యమధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. మిత్రులు మీకు సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో బంధువుల నుంచి ఒత్తిడులు. శ్రమాధిక్యం.  అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వీరికి పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

కన్య : (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని పనులు జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి.  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు  చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గే అవకాశం. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. బం«ధువులతో తగాదాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల : (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
మొదట్లో ఎదురయ్యే ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. పనులు చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం.  నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. నిరుద్యోగుల శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, సమస్యలు తీరే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  సన్నిహితులు, మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు కాస్త తగ్గే సూచనలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చిక్కులు, సమస్యలు ఎదురైనా క్రమేపీ అధిగమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం : (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top