వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

11 ఫిబ్రవరి నుంచి 17 ఫిబ్రవరి 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న కార్యాలు సవ్యంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. ఆర్థిక విషయాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో కదలికలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభించవచ్చు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. ధనవ్యయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
నిర్ణయాలు, హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అనుకున్న రాబడి లభిం^è క ఇబ్బంది పడతారు. రుణదాతలను ఆశ్రయిస్తారు. మీ మేథస్సుకు పరీక్షా సమయంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు. నిరుద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవేత్తలకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు అసంతృప్తి కలిగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు కొనసాగుతాయి. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. కోర్టు కేసుల పరిష్కారం. పసుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆదాయం మరింత పెరిగే సూచనలు. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. అనూహ్యమైన రీతిలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. మానసిక అశాంతి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కలిసివచ్చే కాలం. పదోన్నతులు రావచ్చు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఖర్చులు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాల విషయంలో  నిర్లక్ష్యం వద్దు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగల అవకాశం. వారం చివరిలో శుభవార్తలు. విందువినోదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సిద్ధి కోసం గణపతిని పూజించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
రుణదాతల నుంచి ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం రాబోతోంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. పసుపు, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంత కష్టించినా ఆశించిన ఫలితం అందుకోలేరు. బంధువుల తాకిడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వ్యవహారాలలో అవరోధాలు పరీక్షగా మారతాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. కొన్ని పర్యటనలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో నిరుత్సాహం. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయవర్గాలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో విందువినోదాలు. వస్తులాభాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో సంభాషిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆర్థిక లావాదేవీల్లో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం మధ్యలో  వృథా ఖర్చులు. బంధువులతో వివాదాలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యభగవానుని స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు కాస్త నిరాశ. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవర్గాలకు చికాకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. వివాదాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వీరికి పట్టిందంతా బంగారమే అనే విధంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన మొత్తాలు అందుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు విశేష ఆదరణ, సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో
11 ఫిబ్రవరి నుంచి  17 ఫిబ్రవరి, 2018 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈనెలంతా మీకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా జీవితమంతా ఒక దగ్గర ఆగిపోయిందన్న ఆలోచన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. ఈవారం ఈ ఆలోచనను దూరం చేసే ఓ మంచి అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని ఈ నెల్లోనే కలుసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : గులాబీ 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆపేస్తూ పోయే మీ వ్యవహార శైలి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. ప్రేమించే వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవితాశయం వైపుకు ఎలా అడుగులు వెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తారు. కొత్త భాష, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఏ ఖర్చు చేసినా ఆచితూచి వ్యవహరించండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఓ అవకాశాన్ని దూరం చేసుకోకండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
చాలాకాలంగా మీ ప్రతిభకు తగ్గ అవకాశం కోసం ఎదురుచూస్తున్న మీకు, ఊహించని అవకాశం ఒకటి వచ్చిపడుతుంది. శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. మీపై వచ్చే విమర్శలకు డీలాపడిపోకుండా ధైర్యంగా ముందుకెళ్లండి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కొత్త పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. 
కలిసివచ్చే రంగు : నీలం 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారం మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఏ పని చేసినా మీ శక్తినంతా వెచ్చించి పనిచేయాలని ఆలోచిస్తారు. మీ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఏదైతే అన్నివిధాలా సరైనది అనిపిస్తుందో ఆ నిర్ణయమే తీసుకోండి. ఎప్పట్నుంచో మొదలుపెట్టాలనుకుంటున్న ఒక పని మరికొంత కాలం ఆలస్యం కావచ్చు. మిమ్మల్ని ఇష్టపడేవారికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తాయి. ప్రశాంతత గురించి ఎక్కువ ఆలోచిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కొన్నాళ్లు అన్నింటికీ దూరంగా ఉంటూ మీకై  మీరు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటారు. ఒక కీలక విషయంలో బలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన బాధ్యతలను మీద వేస్కొని ఇబ్బంది పడిపోకండి. కొత్త పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : వెండి 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈనెలలో వృత్తి జీవితంలో మీరు ఊహించని విజయాలు సాధిస్తారు. మీ స్థాయి అమాంతంగా పెరిగిపోతుంది. చాలాకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలకు తెరపడే సమయం కూడా వచ్చేసింది. ఇకనుంచి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. మీకిష్టమైన ఓ వ్యక్తికి దూరమవ్వాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉంటే మంచిది. ఈ నెల్లోనే ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఓ కీలక మార్పుకు కారణమవుతారు. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
చాలాకాలంగా మీరు విశ్రాంతి కోసం ఎదురుచూస్తున్నారు. దానికి ఇది సరైన సమయం అని నమ్మండి. కొద్దిరోజులు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లిపోయి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టే ఆలోచన చేస్తారు. అందుకు పరిస్థితులు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వారితో ఈ ప్రయాణమంతా మళ్లీ మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
కలిసివచ్చే రంగు : కాషాయ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని గ్రహిస్తారు. అందుకు మీరేం చెయ్యాలన్నది కూడా ఇప్పట్నుంచే ఆలోచిస్తే మంచిది. మీ వెన్నంటే ఉండి మీకు సలహాలిచ్చే ఓ వ్యక్తి మీకొక కొత్తదారిని చూపిస్తారు. ఆ దారిలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటారు. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఒక గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరిష్టపడ్డ వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
వృత్తి జీవితంలో ఈ నెల్లోనే ఓ కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక కొత్త జీవితం ఈ మార్పుతోనే మొదలవుతుంది. అయితే ఈ కొత్త జీవితం మొదలవ్వడానికి ముందు కొద్దికాలం విశ్రాంతి కోరుకుంటారు. అందుకు ఏదైనా మీకిష్టమైన ప్రదేశానికి వెళ్లే ప్రయత్నం చేయండి. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారితో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : చాకొలెట్‌ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈనెలంతా మీరు ఊహించనంత సంతోషంగా ఉంటారు. మీకిష్టమైన వ్యక్తులతో సరదాగా గడుపుతారు. వృత్తి జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఆందోళనకు గురికాకుండా మీ పని మీరు చేస్తూ ఉంటే అన్నీ సర్దుకుంటాయన్న విషయాన్ని బలంగా నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీలో ఏ కొద్దిపాటైనా అశాంతి గనక ఉంటే మీ భాగస్వామితో ఉన్న సమయాలు దాన్ని తుడిచిపెట్టేస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
చాలాకాలంగా మీరు సమయాన్నంతా వృథా చేస్తూ వస్తున్నారన్న విషయం గుర్తించండి. ఇకనైనా పనిమీద శ్రద్ధపెట్టి ముందుకెళ్లండి. కొన్ని గొప్ప అవకాశాలు మీకు దగ్గరగా వచ్చి ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ ఆలోచనా విధానంలో పూర్తి మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలను పాటిస్తూ ఉండండి. మీ చిరకాల కోరిక ఒకటి త్వరలోనే నెరవేరుతుంది.
కలిసివచ్చే రంగు : బూడిదంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం  ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎప్పట్నుంచో కొనుగోలు చేయాలనుకున్న వస్తువులు ఇప్పుడు కొంటారు. ఇందుకోసం ఎక్కువ ఖర్చు చేశామనే ఇంకో ఆలోచన కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక గొప్ప అవకాశం ఈ నెల చివర్లో మీ తలుపు తడుతుంది. అప్పటికి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీరు ప్రేమించే వ్యక్తి మీ నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. 
కలిసివచ్చే రంగు : తెలుపు 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top