టీవీక్షణం: కలలను నెరవేర్చే కార్యక్రమం! | Television artists to make shows of their target for entertainment | Sakshi
Sakshi News home page

టీవీక్షణం: కలలను నెరవేర్చే కార్యక్రమం!

May 25 2014 1:22 AM | Updated on Sep 2 2017 7:48 AM

టీవీక్షణం: కలలను నెరవేర్చే కార్యక్రమం!

టీవీక్షణం: కలలను నెరవేర్చే కార్యక్రమం!

డర్టీ పిక్చర్ సినిమాలో విద్యాబాలన్ డైలాగ్ గుర్తుందా? ‘సినిమాలు కేవలం మూడే మూడింటి కారణంగా ఆడతాయి... ఎంటర్‌టైన్మెంట్, ఎంటర్‌టైన్మెంట్, ఎంటర్‌టైన్మెంట్’.

డర్టీ పిక్చర్ సినిమాలో విద్యాబాలన్ డైలాగ్ గుర్తుందా? ‘సినిమాలు కేవలం మూడే మూడింటి కారణంగా ఆడతాయి... ఎంటర్‌టైన్మెంట్, ఎంటర్‌టైన్మెంట్, ఎంటర్‌టైన్మెంట్’. మన టీవీవాళ్లు ఎంటర్‌టైన్మెంట్ కోసమే రకరకాల ప్రోగ్రామ్స్ రూపొందిస్తుం టారు. కానీ ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం సబబేనా? ఏదైనా మంచిని చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా?
 
 సినిమాలన్నీ ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినా, ఎంత వినోదాన్నే ప్రధానంగా చేసుకున్నా... సామాజికాంశాలను చర్చిస్తూ, సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపించే విధంగా కూడా అప్పుడప్పుడూ తెరకెక్కుతుంటాయి. వినోదమే ముఖ్యం కాదు, సందేశం కూడా అవసరమే అన్న విషయాన్ని గుర్తు చేస్తుంటాయి. మరి టీవీ కార్యక్రమాల మాటేమిటి? ఎంతసేపూ రియాలిటీ షోలు, సీరియళ్లు అంటూ సందడి చేయడమేనా లేక ఏదైనా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందా?
 
 జరుగుతోంది. కచ్చితంగా జరుగుతోంది. దానికి ‘మిషన్ సప్నే’ కార్యక్రమమే మంచి ఉదాహరణ!  మన దేశంలో ఎంతోమంది ఇప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. వారిలో చాలామందికి అనారోగ్యం ఏర్పడితే చికిత్స చేయించుకునే స్తోమత కూడా లేదు. అలాంటివారికి సహాయం చేసే ఉద్దేశంతో కలర్స్‌టీవీ రూపొందించిన కార్యక్రమమే ‘మిషన్ సప్నే’. చానల్స్‌వారు ఎంతసేపూ సెలెబ్రిటీలను పిలిచి ఇంటర్వ్యూలు చేయడం, జడ్జిలుగా వ్యవహరించమనడం చేస్తుంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వారితో సేవ చేయిస్తున్నారు. ఫండ్స్ రెయిజ్ చేస్తున్నారు.
 
 సల్మాన్‌ఖాన్ నడిరోడ్డు మీద హెయిర్ కట్ చేస్తే...! వరుణ్ ధావన్ కూరగాయలు అమ్మితే...! టెలివిజన్ బ్యూటీ క్వీన్ ద్రష్టి ధామి బుట్టలో పళ్లు పెట్టుకుని అమ్ముతుంటే...! కరణ్ జోహార్ గైడ్‌గా మారితే...! ప్రముఖ నటుడు రామ్‌కపూర్ ట్యాక్సీ నడిపితే...! రణబీర్ కపూర్ పావ్ భాజీ అమ్మితే..! వాళ్లకివన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అనేగా? వాళ్లకి అవసరం లేదు. కానీ చేస్తున్నారు. ‘మిషన్ సప్నే’ టీమ్ వాళ్లతో అవన్నీ చేయిస్తున్నారు. ఆ వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానమై నడిపిస్తోన్న ఈ కార్యక్రమానికి ప్రజల సహకారంతో పాటు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, ప్రముఖ సెలెబ్రిటీల అండ కూడా ఉండటంతో ప్రోగ్రామ్ విజయవంతంగా నడుస్తోంది. టీవీ ప్రోగ్రాములు వినోదాన్ని పంచడానికే కాదు, సమాజానికి మంచి చేయడానిక్కూడా అని నిరూపించిన ‘మిషన్ సప్నే’ టీమ్‌ని అభినందించి తీరాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement