వీజీగా వేపేస్తుంది... | Smartphone App of Autopilot | Sakshi
Sakshi News home page

వీజీగా వేపేస్తుంది...

Oct 9 2016 1:32 AM | Updated on Sep 4 2017 4:40 PM

వీజీగా వేపేస్తుంది...

వీజీగా వేపేస్తుంది...

వేపుడు వంటకాలను వీజీగా చేసుకోవడానికి వీలుంటే బాగుండునని చాలామంది అనుకునే ఉంటారు.

వేపుడు వంటకాలను వీజీగా చేసుకోవడానికి వీలుంటే బాగుండునని చాలామంది అనుకునే ఉంటారు. అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చింది ఈ ఇంటెలిజెంట్ మూకుడు. అందుకే దీనికి ‘పాంటెలిజెంట్’ అనే పేరు పెట్టారు. చూడటానికి సాదా సీదాగానే కనిపిస్తుంది గాని,  ఇది చాలా స్మార్ట్ గురూ! అనకుండా ఉండలేరు. ఇండక్షన్ స్టవ్ మీదైనా, గ్యాస్ స్టవ్ మీదైనా... దేని మీదైనా దీంతో కోరుకున్న వేపుళ్లను టేస్టీ టేస్టీగా వేయించేసుకోవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఈ మూకుడులోని టెంపరేచర్ సెన్సర్లు ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఉంటాయి.

దాని బట్టి మూకుడులోని వంటకాన్ని ఎప్పుడు తిరగేయాలో, కలపాలో నిర్ణయించుకోవచ్చు. అలాగే, ఎప్పుడు వేడిని పెంచాలో, తగ్గించాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఇదంతా తలనొప్పి వ్యవహారంలా అనిపిస్తే, ఇందులోని ‘ఆటోపైలట్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు ఈ మూకుడు తనకు కావలసిన వేడిని తనే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఏమాత్రం తేడా లేకుండా టేస్టీ టేస్టీగా వేడివేడి వేపుడును వడ్డనకు సిద్ధం చేసి పెడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement