సివంగీ...స్ | Police role In act's Four heroins | Sakshi
Sakshi News home page

సివంగీ...స్

Aug 9 2015 1:10 AM | Updated on Apr 3 2019 6:23 PM

సివంగీ...స్ - Sakshi

సివంగీ...స్

ఈ బాలీవుడ్ భామలను అందరూ గ్లామర్ డాల్స్ అంటారు. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారు అనుకుంటారు. కానీ...

పోలీస్ పాత్రల్లో కనబడ్డ నలుగురు సివంగులు
ఈ బాలీవుడ్ భామలను అందరూ గ్లామర్ డాల్స్ అంటారు. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారు అనుకుంటారు. కానీ ఒక్కసారి వీళ్లని ఖాకీ డ్రెస్సులో చూస్తే తెలుస్తుంది... వారిలో ఎంత కరకుదనం ఉందో!

 
బిపాసా బసు... గ్లామర్ క్వీన్. హాట్ బ్యూటీ. అందాలతో మత్తెక్కిస్తుంది. సోయగాలతో మైమరపిస్తుంది. ‘గునాహ్’ సినిమా చూసేవరకూ ఇలాగే మాట్లాడుకున్నారు బిప్స్ గురించి. కానీ ఆ సినిమాలో యూనిఫామ్‌లో రఫ్‌గా కనిపించిన ఆమెను చూసి గతుక్కుమన్నారు. సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా హుందాగా కనిపించిన బిపాసాను చూసి సూపర్‌‌బ అన్నారు. ఆ తర్వాత ‘ధూమ్ 2’లో కూడా పోలీసు పాత్రలో నటించి మెప్పించింది బిప్స్!
 
సోహా అలీ ఖాన్
అమ్మ షర్మిలా ఠాగూర్ అందాన్ని, అన్న సైఫ్ అలీ ఖాన్ స్టైల్‌ని పుణికి పుచ్చుకుంది సోహా అలీ ఖాన్. కొత్త కొత్త ఫ్యాషన్లను అనుసరించడం, వీలైనంత గ్లామరస్‌గా కనిపించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పని. కానీ ‘మిస్టర్ జో భీ కర్‌వాలో’ చిత్రం చూస్తే ఈమె సోహాయేనా అనిపిస్తుంది. ఇన్‌స్పెక్టర్ శాంతిప్రియా ఫడ్నిస్‌గా యూనిఫామ్‌లో ఎంతో డిఫరెంట్‌గా కనిపిస్తుంది సోహా. తుపాకులు పేలుస్తూ, రౌడీల మక్కెలు విరగదన్నుతూ యాక్షన్ హీరోలను మరిపించింది.
 
ఇషా గుప్తా
హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీకి చెల్లెలేమో అనిపిస్తుంది ఇషా గుప్తాని చూస్తే. తన గ్లామర్‌తో బాలీవుడ్ వారి మతులు పోగొట్టేసిన ఈ సుంద రాంగికి పోలీసు పాత్రలో నటించాలనేది డ్రీమ్. ఆ కలను ‘చక్రవ్యూహ్’ సినిమా తీర్చింది. అందులో ఐపీఎస్ ఆఫీసర్ రియా మీనన్‌గా జీవించి మార్కులు కొట్టేసింది ఇషా. చాన్స్ దొరికితే మళ్లీ యూనిఫామ్ వేయడానికి రెడీ అనేంత పిచ్చి ఆమెకు పోలీసు పాత్ర అంటే!
 
షమితాశెట్టి
‘మొహొబ్బతే’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శిల్పాశెట్టి చెల్లెలు షమితాశెట్టి. కానీ పాపం కెరీర్ అనుకున్నంతగా సాగలేదు. పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే తన పేరు చెబితే గుర్తొచ్చే పాత్రలు కొన్ని చేసింది షమిత. ‘క్యాష్’, ‘జెహెర్’ చిత్రాల్లో స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీసా ఫీరుగా ఆమె నటనను మెచ్చుకుని తీరాలి. ఓ పక్క కూల్‌గా కనిపిస్తూనే ఖాకీ డ్రెస్సులో కరకుదనాన్ని ప్రదర్శించి అదరగొట్టేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement