ప్రెట్టీ పేపర్ క్లిప్స్ | Paper clips | Sakshi
Sakshi News home page

ప్రెట్టీ పేపర్ క్లిప్స్

May 29 2016 12:37 AM | Updated on Sep 4 2017 1:08 AM

ప్రెట్టీ పేపర్ క్లిప్స్

ప్రెట్టీ పేపర్ క్లిప్స్

పిల్లలు హోం వర్క్ రాసుకునేటప్పుడు, ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు పేపర్స్ ఎగిరిపోకుండా ఏం వాడుతారు?

పిల్లలు హోం వర్క్ రాసుకునేటప్పుడు, ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు పేపర్స్ ఎగిరిపోకుండా ఏం వాడుతారు? మమ్మీ లేదా డాడీ ఇంట్లో సరుకుల చిట్టీ రాస్తున్నప్పుడు పేపర్లు అటూ ఇటూ పోకుండా ఉండేందుకు ఏం చేస్తారు? ఈ రెండింటికీ సమాధానం.. ‘పేపర్ క్లిప్స్’ వాడుతారు. ప్రస్తుతం ఇవి స్టీల్, గోల్డ్ కలర్లోనే కాక వివిధ రంగుల్లోనూ దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడేంటి అంటారా? ఒక్కసారి పక్కనున్న ఫొటోలను చూస్తే ఈ పేపర్ క్లిప్స్ టాపిక్ ఎందుకో అర్థమవుతుంది. ఆ జ్యుయెలరీ అంతా పేపర్ క్లిప్స్‌తో తయారు చేసినవే.. మీకూ కావాలా? అయితే ట్రై చేయండి..
 
కావలసినవి: పేపర్ క్లిప్స్, వివిధ రంగుల టేపులు, హుక్స్ (ఇయర్ రింగ్స్, చెయిన్ తయారీకి), పూసలు (కావాలనుకుంటేనే)

తయారీ విధానం: ముందుగా బ్రేస్‌లెట్, చెయిన్ తయారీ చూద్దాం.. కొన్ని పేపర్ క్లిప్స్‌ను తీసుకొని, కొన్నిటికి బ్లూ కలర్ టేప్, మరికొన్నిటికి ఆరెంజ్ కలర్ టేప్‌ను చుట్టండి. తర్వాత వాటిని ఒకదానికొకటి తగిలించండి. అలా మీకు కావలసిన సైజులో బ్రేస్‌లెట్, చెయిన్‌ను తయారు చేశాక, వాటి చివరి క్లిప్‌కు మొదటి క్లిప్‌ను తగిలిస్తే సరి. చాలా సులభంగా ఉంది కదూ వీటి తయారీ. అలాగే రంగురంగుల క్లిప్స్‌ను గుత్తిగా చేసి, వాటికి పూసలు తగిలించి హుక్ పెట్టేస్తే అందమైన ఇయర్ రింగ్స్ కూడా రెడీ అవుతాయి. అంతేకాకుండా గోల్డ్ కలర్ క్లిప్స్‌ను తీసుకొని ఒకదానికొకటి వరుసగా తగిలించుకుంటూ పోతే.. ఎంతో అందమైన నెక్‌లేస్ తయారవుతుంది. ఇంకెందుకు వెయిటింగ్.. ఇంట్లో ఉన్న పేపర్ క్లిప్స్ తీసుకొని జ్యుయెలరీ మేకింగ్ స్టార్ట్ చేయండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement