tapes
-
పెను గాలుల నుంచి టేపులతో అరటికి రక్షణ!
అరటి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు పెనుగాలులు తీవ్ర నషాన్ని కలిగిస్తూ ఉంటాయి. లక్షలు పెట్టుబడి పెట్టి పెంచిన అరటి తోటల్లో కొద్ది రోజుల్లో గెలలు కోతకు వచ్చే దశలో సుడిగాలులు, తుపాన్లకు విరిగి పడిపోతే రైతులకు నూటికి నూరు శాతం నష్టం జరుగుతుంది. వెదురు బొంగుల ఊతంతో అరటి చెట్లకు గాలుల నుంచి రక్షించుకునేందుకు రైతులు విఫలయత్నం చేస్తూ వుంటారు. అయితే, కర్ణాటకలో అరటి తోటలు సాగు చేస్తున్న ఒక యువ రైతు సరికొత్త ఆలోచనతో, తక్కువ ఖర్చుతోనే అరటి తోటలను పెను గాలుల నుంచి చక్కగా రక్షించుకుంటున్నారు. చెట్టుకు నాలుగు వైపులా గూటాలు వేసి, వాటికి ప్లాస్టిక్ టేప్‌లను కట్టటం ద్వారా పెను గాలుల నుంచి అరటి చెట్లను చాలా వరకు రక్షించుకోవచ్చని యువ రైతు సురేష్ సింహాద్రి చెబుతున్నారు.. సురేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు. కర్ణాటకలోని మైసూరుప్రాంతానికి వలస వెళ్లి కొన్ని సంవత్సరాల నుంచి యాలక్కి రకం అరటి తోటలను కౌలు భూముల్లో సాగు చేస్తున్నారు. చామరాజానగర జిల్లా కొల్లేగాలా తాలూకా, సత్తేగాల గ్రామంలో సురేష్ అరటి తోటలను సాగు చేస్తున్నారు. ఆయన అనుభవాలు.. ఆయన మాటల్లోనే..అరటి చెట్లకు నాలుగు వైపులా గూటాలు వేసి టేపులతో కట్టేస్తాంగాలుల నుంచి అరటి చెట్లకు గల సమస్యను అధిగమించడానికి తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాధారణంగా వెదురు బొంగులను ఆసరాగా పెట్టి అరటి చెట్లకు రక్షణ కల్పిస్తుంటారు. ఇందుకోసం కర్రల కొనుగోలుకే ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే, మేము కర్రల అవసరం లేకుండా కేవలం టేపులతోనే అరటి చెట్టుకు నాలుగు వైపులా కట్టి గాలుల నుంచి విజయవంతంగా రక్షించుకుంటున్నాం. చెట్టుకు నాలుగు వైపులా నేలలోకి కట్టె గూటాలు దిగవేసి, వాటికి టేపులతో అరటి చెట్టు పై భాగాన్ని కడుతున్నాం. చెట్టుకు గట్టిగా బిగుతుగా కట్టకుండా కొంచెం వదులుగా ఉండేలా చెట్టు చుట్టూతా టేపులను రక్షణ చక్రం మాదిరిగా కడతాం. గాలులు వీచి చెట్టు అటూ ఇటూ ఊగినప్పుడు చెట్టు కాండం విరిగి పడిపోకుండా రక్షించుకుంటున్నాం. చెట్టుకు 6 నెలల వయసులో పువ్వు దశలో టేపు కట్టాలి. గత ఏడాది ఎప్పుడూ ఎరుగని రీతిలో మాప్రాంతంలో గాలి వాన వచ్చి అరటి తోటలే కాదు, కరెంటు స్థంభాలు కూడా కూలిపోయాయి. అయినా, మా తోటలో కొన్ని చెట్లు మాత్రమే ఒరిగాయి. మిగతా చెట్లు అదృష్టం కొద్దీ గాలులను చాలా వరకు తట్టుకున్నాయి. టేపులతో కట్టటం వల్లనే ఇది సాధ్యమైంది.ఎకరానికి రూ. 12 వేల ఖర్చుఎకరం అరటి తోటకు రూ. 12 వేల ఖర్చుతోనే టేపులతో రక్షణ కల్పించుకుంటున్నాం. ఎకరానికి 25 కిలోల టేపు అవసరం అవుతుంది. కిలో ధర రూ. 130. టేపులు కట్టడానికి కట్టె గూటాలు కావాలి. యూకలిప్టస్ లేత కర్రలను కొనుగోలు చేసి, 2 అడుగుల గూటాలను తయారు చేసుకొని వాడుతున్నాం. అడుగున్నర లోతు వరకు నేలలోకి ఏటవాలుగా దిగగొట్టి, ఆ గూటాలకు టేపులు కడతాం. దీని వల్ల గాలులు వచ్చినప్పుడు అవి చెక్కుచెదర కుండా చెట్టును కాపాడుతున్నాయి. కూలీల ఖర్చుతో కలిపితే చెట్టుకు రూ. 10 లకు మించి ఖర్చు కాదు. 6“6 దూరంలో అరటి మొక్కలు నాటితే ఎకరానికి 1200 మొక్కలు పడతాయి. అంటే.. ఎకరానికి టేపులు కట్టడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 12,000 మాత్రమే! కట్టిన టేపు రెండో పంటకు వాడటానికి పనికిరాదు. ప్రతి పంటకు మళ్లీ కట్టుకోవాలి. మేం యాలక్కి రకం నాటు రకం పిలకలను తెప్పించి నాటుతున్నాం. టిష్యూకల్చర్ మొక్కలు నాటితే అవి మరీ ఎత్తు పెరుగుతాయి. నాటు పిలకలు అయితే ఎత్తు తక్కువ పెరుగుతాయి, కాండం గట్టిగా కూడా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, వినియకచవితి రోజుల్లో ఈ రకం అరటికాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కిలో కాయలను రూ. వందకు కూడా అమ్ముతూ ఉంటాం. రైతుగా నా అనుభవాలను, టేపులను అరటి చెట్లకు కట్టే విధానాన్ని చూపే వీడియోలను ‘మీ ఫార్మర్ సురేష్ (@MeFarmerSuresh)’ అనే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. రైతులు ఈ వీడియోలు చూసి అవగాహన పెంచుకోవచ్చు. నా ఫోన్ నంబర్: 99004 42287. -
దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...
ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఒక మహిళను భర్త చేతిలో హతం కాకుండా కాపాడింది. సరికొత్త ఫ్యూచర్లతో మంచి ఎలక్ట్రానిక్ గాడ్జ్ట్లు ఆకర్షణీయంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రజలు కూడా అంతే క్రేజ్‌గా కొంటున్నారు. ఈ కొంగొత్త టెక్నాలజీలు మనుషులను కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అచ్చం అలానే ఇక్కడొక మహిళను ఒక యాపిల్ వాచ్ విపత్కర సమయంలో దేవుడిలా రక్షించింది. వివరాల్లోకెళ్తే..వాషింగ్టన్‌కి చెందిన యంగ్ సూక్ ఆన్ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో గత కొంతకాలంగా గొడవపడుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఐతే విడిపోతే ఆమెకు భరణంగా తన రిటైర్మెంట్ డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా చాంగ్ క్యోంగ్ ఆమె ఇంటికి వచ్చి గొడవపడటేమే గాక తన కుట్రలో భాగంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. తదనంతరం ఆమెను టేప్‌తో చుట్టి గ్యారెజ్ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను కార్‌వ్యాన్‌లో ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. ఆమె ఎంత ప్రాధేయపడుతున్న వినలేదు. దీంతో ఆమె తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ సాయంతో అత్యవసర నెంబర్ 911కి కాల్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి....వాషింగ్టన్‌లోని సీటెల్‌కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. ఐతే ఆమె అప్పటికే తీవ్ర అశ్వస్థకు గురై కొన ప్రాణాలతో కొట్టుకుంటోంది. ఆమె ఆ సమయంలో తన 20 ఏళ్లు కూతురుకి కూడా తాను ప్రమాదంలో ఉన్నట్లు వాచ్ ద్వారా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అందరూ సమయానికి అప్రమత్తమవ్వడంతోనే ఆమెను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రక్షించే సమయంలో ఆమె మొత్తం టేప్‌తో సీల్ చేసి తీవ్ర గాయలపాలై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతక మునుపు కూడా ఈ యాపిల్ వాచ్ ఎంతమందినో పలురకాలుగా వారి ప్రాణాలను కాపాడింది. (చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!) -
టేప్ తళుకులు
వారం వారం ఎన్నో రకాల మేడ్ ఇన్ హోమ్ జ్యుయెలరీని చూస్తున్నాం. మనకు సులువుగా దొరికే వాటితో... ఇయర్ రింగ్స్, నెక్లేస్, బ్రేస్లెట్ల తయారీని తెలుసుకుంటున్నాం. ఈసారి వెరైటీగా కనిపించే... అనిపించే జ్యుయెలరీని చూద్దాం. పక్కనున్న ఫొటోల్లో కనిపిస్తున్న జ్యుయెలరీ మొత్తం టేపులతో తయారు చేసినవే. ప్రస్తుతం షాపుల్లో ఇవి వివిధ డిజైన్లలో దొరుకుతున్నాయి. పెద్ద ఖర్చేమీ లేకుండా.. సులువుగా ఉంటుంది వీటి మేకింగ్. ఎలా అంటే.. కావలసినవి: రంగురంగుల టేపులు (డిజైన్స్‌తో ఉన్నవి), కత్తెర, ఇయర్ రింగ్ హుక్స్, ఓల్డ్ బ్యాంగిల్స్, ఓల్డ్ మెటల్ రింగ్స్ తయారీ: ముందుగా టేప్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఫోల్డ్ చేస్తూ, ఒకదానికొకటి అతికించి ఓల్డ్ రింగ్‌కు చుట్టాలి. అలాకాకుండా, ఫొటోలో కనిపిస్తున్నట్టు పూర్తిగా టేప్తోనే రింగ్స్ తయారు చేసుకోవచ్చు. మరి ఇయర్ రింగ్స్‌ను తయారు చేసుకోవాలంటే... టేప్ ముక్కలను తీసుకొని, కత్తెర సాయంతో పక్షి ఈకల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వాటికి ఇయర్ రింగ్ హుక్స్ను తగిలించాలి. లేదా ఏదైనా అట్ట ముక్కను మీకు నచ్చిన షేపులో కట్ చేసి, ఈ టేప్‌ను అంటించి... వాటికి హుక్‌ను తగిలించాలి. ఏ డ్రెస్సు కలర్‌కు మ్యాచ్ అయ్యేలా ఆ రంగు టేప్‌తో వీటిని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ టేప్‌ను డిజైన్‌గా కట్ చేసి మడిస్తే... చెయిన్‌కు లాకెట్గానూ మారిపోతుంది. అంతేకాదు... ఓల్డ్ బ్యాంగిల్స్‌కు కలర్‌ఫుల్ టేపులను చుడితే... అవి కొత్త గాజుల్లా మెరిసిపోతాయి. అలాగే పొడవు టేపును ఫోల్డ్ చేస్తూ... పూసలు గుచ్చితే అందమైన బ్రేస్లెట్ రెడీ అవుతుంది. ఇదే పద్ధతిలో చెయిన్లనూ తయారు చేసుకోవచ్చు. -
ప్రెట్టీ పేపర్ క్లిప్స్
పిల్లలు హోం వర్క్ రాసుకునేటప్పుడు, ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు పేపర్స్ ఎగిరిపోకుండా ఏం వాడుతారు? మమ్మీ లేదా డాడీ ఇంట్లో సరుకుల చిట్టీ రాస్తున్నప్పుడు పేపర్లు అటూ ఇటూ పోకుండా ఉండేందుకు ఏం చేస్తారు? ఈ రెండింటికీ సమాధానం.. ‘పేపర్ క్లిప్స్’ వాడుతారు. ప్రస్తుతం ఇవి స్టీల్, గోల్డ్ కలర్లోనే కాక వివిధ రంగుల్లోనూ దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడేంటి అంటారా? ఒక్కసారి పక్కనున్న ఫొటోలను చూస్తే ఈ పేపర్ క్లిప్స్ టాపిక్ ఎందుకో అర్థమవుతుంది. ఆ జ్యుయెలరీ అంతా పేపర్ క్లిప్స్‌తో తయారు చేసినవే.. మీకూ కావాలా? అయితే ట్రై చేయండి.. కావలసినవి: పేపర్ క్లిప్స్, వివిధ రంగుల టేపులు, హుక్స్ (ఇయర్ రింగ్స్, చెయిన్ తయారీకి), పూసలు (కావాలనుకుంటేనే) తయారీ విధానం: ముందుగా బ్రేస్లెట్, చెయిన్ తయారీ చూద్దాం.. కొన్ని పేపర్ క్లిప్స్‌ను తీసుకొని, కొన్నిటికి బ్లూ కలర్ టేప్, మరికొన్నిటికి ఆరెంజ్ కలర్ టేప్‌ను చుట్టండి. తర్వాత వాటిని ఒకదానికొకటి తగిలించండి. అలా మీకు కావలసిన సైజులో బ్రేస్లెట్, చెయిన్‌ను తయారు చేశాక, వాటి చివరి క్లిప్‌కు మొదటి క్లిప్‌ను తగిలిస్తే సరి. చాలా సులభంగా ఉంది కదూ వీటి తయారీ. అలాగే రంగురంగుల క్లిప్స్‌ను గుత్తిగా చేసి, వాటికి పూసలు తగిలించి హుక్ పెట్టేస్తే అందమైన ఇయర్ రింగ్స్ కూడా రెడీ అవుతాయి. అంతేకాకుండా గోల్డ్ కలర్ క్లిప్స్‌ను తీసుకొని ఒకదానికొకటి వరుసగా తగిలించుకుంటూ పోతే.. ఎంతో అందమైన నెక్లేస్ తయారవుతుంది. ఇంకెందుకు వెయిటింగ్.. ఇంట్లో ఉన్న పేపర్ క్లిప్స్ తీసుకొని జ్యుయెలరీ మేకింగ్ స్టార్ట్ చేయండి. -
'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు'
న్యూఢిల్లీ: 'డాన్‌కు ఏమి తెలియదు. డాన్ ఏ నేరం చేయలేదు. ఇంట్లో వాళ్లను ఎక్కడైనా పెంపుడు జంతువులు హత్య చేస్తాయా' అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ప్రశ్నించారు. ఇంతకీ డాన్ అంటే ఏమిటని అనుకుంటున్నారా..? అది సోమనాథ భారతి పెంపుడు కుక్క పేరు. ప్రస్తుతం సోమనాథ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా తనపై హత్యా ప్రయత్నం చేశారని, గృహహింసకు పాల్పడ్డారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక దర్యాప్తు ప్రస్తుతం ఈ డాన్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే లిపికా మిత్రా ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో తన బాస్(సోమనాథ భారతి) ఆదేశాలను పాటించి డాన్ దాడి చేసిందని, మీదపడి కరిచిందని, ముఖ్యంగా తన కడుపుపై తీవ్రగాయాలు చేసిందని, మరికొన్ని చోట్ల కూడా దారుణంగా దాడి చేసి చంపేయత్నం చేసిందని పోలీసులకు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో టేపులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. అయితే, ఆ వీడియో టేపులను కావాలనే సోమనాథ భారతి మాయం చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కోర్టులో అరెస్టు నుంచి ఉపశమనం పొందిన ఆయన విచారణ కోసం ఇటీవల తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన పెంపుడు కుక్కను గురించి పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన జీపులోని వెనుక సీట్లో డాన్‌ను తీసుకొచ్చిన ఆయన దానిని మీడియాకు చూపిస్తూ 'పెంపుడు జంతువులు ఎక్కడైనా ఇంట్లో వాళ్లను హత్య చేస్తాయా.. డాన్ కరుస్తాడా? చూడండి అంటూ ప్రశ్నించారు. డాన్గానీ, తాను గానీ ఏ తప్పూ చేయలేదని నిజంగా కావాలంటే తన వద్ద టేపుల ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. బెయిల్ పిటిషన్ కోసం ఆ ఆడియో టేపులను కూడా జత చేసినట్లు చెప్పారు. -
ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు
- రేవంత్ సహా నిందితుల సెల్ఫోన్లు, ఆడియో, వీడియో టేపులు కూడా - ఏసీబీ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు - బాబు సంభాషణపై నిగ్గుతేల్చనున్న ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు - 2, 3 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు బాగోతం రెండు, మూడు రోజుల్లో బట్టబయలుకానుంది! ఈ కేసులో ఏసీబీ అధికారులు రికార్డు చేసిన ఆడియో, వీడియో సీడీలతోపాటు నిందితులైన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సీసీటీవీ రికార్డులు, కంప్యూటర్ పరికరాలను విశ్లేషణ కోసం ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపింది. ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు పంపిన వాటిలో రాజకీయ ప్రముఖులు మాట్లాడినవిగా చెబుతున్న 14 ఆడియో టేపులు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా స్టీఫెన్సన్ సోదరుడి ఇంట్లో నడిచిన రూ. 5 కోట్ల డీల్ తతంగం, రూ. 50 లక్షల అడ్వాన్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీలు, రేవంత్‌రెడ్డితోపాటు మిగతా ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపారు. నిందితులతో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ వివిధ సందర్భాల్లో మాట్లాడేందుకు వాడిన మొబైల్‌ఫోన్ సహా 21 ఫోన్లు, 3 సోనీ డిజిటల్ రికార్డర్లు, సీపీయూ, హార్డ్‌డిస్క్‌లను పరీక్షల కోసం పంపించారు. దీంతో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన మాటలపై చంద్రబాబు అండ్ కో చెపుతున్నట్టుగా ‘ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను తెచ్చి అతికించారా... చంద్రబాబే మాట్లాడారా ...’ అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చనున్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి, చినబాబు లోకేశ్, ఎంపీలు, తెలుగుదేశం పోషకులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు మాట్లాడిన రికార్డుల నాణ్యతను కూడా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వనున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వ చ్చాక కూడా రికార్డుల్లో ఉన్న మాటలు తమవి కావంటే సంబంధిత వ్యక్తుల మాటలను మరోసారి రికార్డు చేసి నిజాలను బహిర్గతం చేస్తారు. సోమవారం నాటికి వీటికి సంబంధించిన నివేదిక రావచ్చని ఓ అధికారి తెలిపారు. స్టీఫెన్సన్ స్టేట్మెంట్ సేకరించే పనిలో.. చంద్రబాబు ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి అండ్ కో తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాతపూర్వకంగా ఏసీబీని ఆశ్రయించి ఓటుకు కోట్ల కేసును తెరపైకి తెచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. సోమవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసు తీవ్రతను కోర్టు ముందు ఉంచేందుకు తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ న్యాయమూర్తికి సమర్పించాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శని, ఆదివారాల్లో స్టీఫెన్సన్ స్టేట్మెంట్ను రికార్డు చే సి సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. పసుపు శిబిరంలో ఆందోళన... ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఆయన జైలుపాలైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రూ. 50 లక్షలు తీసుకెళ్లారని స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ రికార్డులతో తేటతెల్లమైంది. ఫోన్ రికార్డులు బయటపడ్డప్పటి నుంచి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పొంతన లేకుండా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల చుట్టూ చెక్కర్లు కొడుతున్నా పసుపు శిబిరంలో ఆందోళన మాత్రం తగ్గలేదు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన రికార్డింగ్‌లతోపాటు ఆయన తనయుడు లోకేశ్ నాలుగో నిందితుడుగా ఉన్న మత్తయ్యతో మాట్లాడిన రికార్డులు కూడా ఏసీబీ వద్ద ఉన్నట్లు తేలడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.