పట్టుకోండి చూద్దాం
అజాతశత్రువు అనే మాట వినడమేగానీ చూడని వాళ్లు ఆనంద్ కుమార్‌ను ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అరవై అయిదు సంవత్సరాల ఆనంద్‌కుమార్ బ్రహ్మచారి. ‘‘ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’’ అని అడిగితే- ‘‘బాగా డబ్బు గడించాలనే ఆశతో ఏవోవో వ్యాపారాలు చేశాను. కోట్లు గడించాను. డబ్బు గురించి తప్ప వేరే ఆలోచనేదీ లేకుండా జీవించాను. పెళ్లి చేసుకోవాలనే విషయమే మరిచిపోయాను. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది. కానీ మనశ్శాంతి లేదు’’ అంటాడు సిగెరెట్ వెలిగిస్తూ ఆనంద్ కుమార్.
ఆనంద్‌కు తన అక్కయ్య కొడుకు, చెల్లి కొడుకు, తమ్ముడి కొడుకు అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లాలో ఒంటరిగా నివసించే ఆనంద్ ప్రతి వేసవిలో పిల్లల్ని తన ఇంటికి పిలిపించుకొని నెలరోజులు సరదాగా గడుపుతాడు. ఈసారి కూడా అదే జరిగింది. కాకినాడ నుంచి తన అక్కయ్య అన్నపూర్ణ కొడుకు అంకిత్ వచ్చాడు. పెద్దగా ఎవరితోనూ కలిసిపోడు. ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే సన్నిహితులతో మాత్రం బాగా కలిసిపోతాడు.
అనంతపురం నుంచి తమ్ముడు అనంత్ కుమారుడు హరీశ్ వచ్చాడు. హరీశ్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. కబుర్ల పుట్ట! వైజాగ్ నుంచి చెల్లి రజని కుమారుడు తరుణ్ వచ్చాడు. తరుణ్ విపరీతంగా నవలలు చదువుతాడు. తాను చదివిన వాటిని ఇతరులతో చెప్పుకొని తెగ ఆనందిస్తుంటాడు. ‘‘మామయ్యా... ఈ రూమ్‌కు నో స్మోకింగ్ రూమ్ అని బోర్డ్ తగిలించావేమిటి?’’ అని అంకిత్ అడిగాడు.
‘‘నా వరకు ఇది పవిత్రమైన రూమ్. ఇక్కడ నేను రోజూ ధ్యానం చేస్తాను. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను. కొన్నిసార్లు మౌనంగా కూర్చుంటాను’’ అన్నాడు ఆనంద్ కుమార్.
ఆరాత్రి... ఉన్నట్టుండి వర్షం మొదలైంది. వాతావరణం చల్లగా ఉంది. ఆ చల్లని రాత్రి అంకిత్, తరుణ్, హరీశ్‌లతో కబుర్లు చెబుతున్నాడు ఆనంద్ కుమార్. ఆ కబుర్ల మధ్యలోనే ఒకసారి ఆనంద్ స్వరం కాస్త గరంగా మారింది.
‘‘జీవితాన్ని ఎంజాయ్ చేయడం ముఖ్యమే కానీ అదే జీవితం కాకూడదు. మీలో ఎవరూ చదువులపై, కెరీర్‌పై శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతుంది. ఇది మంచిది కాదు...’’ ఇలా చాలాసేపే మాట్లాడాడు ఆనంద్ కుమార్. ఆయన మాటలకు కోపం తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ‘‘పెద్దాయన చెప్పింది నిజమే కదా’’ అనుకున్నవాళ్లు ఉన్నారు.
మరుసటి రోజు పని మనిషి సుందరం ఆనంద్‌కుమార్ ఇంట్లోకి వచ్చాడు. కాఫీ చేసి ఆయనకు అందించడానికి బెడ్రూమ్లోకి వెళ్లాడు. అంతే... ఆనంద్ కుమార్ శవం కనిపించింది. ‘హత్య...’ గట్టిగా అరిచాడు సుందరం. ఇంతకీ ఆనంద్‌కుమార్‌ని ఎవరు హత్య చేశారు? ఆ ముగ్గురా?(అంకిత్, తరుణ్, హరీశ్), ఆ ముగ్గురిలో ఒకరా? దొంగలా? సుందరమా? ఎన్నో జటిలమైన కేసులను చేధించిన నరసింహ ఈ కేసులో కూడా హంతకుడెవరో సులభంగానే కనిపెట్టాడు.
క్లూ: టాయిలెట్రూమ్, ఆర్ట్రూమ్, రెస్ట్రూమ్, అండర్ వాటర్ రూమ్, నో స్మోకింగ్ రూమ్‌లో హంతకుడు ఒక్కొక్క వస్తువును వదిలివెళ్లాడు.
జవాబు: హంతకుడి పేరు తరుణ్.
తరుణ్‌కు క్రైమ్ నవలలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఆ కథల్లోనే జీవిస్తుంటాడు. తరుణ్ ముక్కోపి. ఆ రాత్రి తనను ఆనంద్‌కుమార్ మందలించడం నచ్చలేదు. ఆ కోపంతో ఆనంద్‌కుమార్‌ని హత్య చేశాడు. క్రెమ్నవలలు చదివిన ప్రభావంతో తన పేరులోని అక్షరాలు వచ్చేలా ఒక్కో గదిలో ఆనంద్కుమార్కి సంబంధించిన వస్తువును పెట్టాడు. ఈ విపరీత బుద్దే అతడిని పట్టించింది.
టాయిలెట్ రూమ్(T), ఆర్ట్ రూమ్ (A), రెస్ట్ రూమ్(R), అండర్ వాటర్ రూమ్(U), నో స్మోకింగ్ రూమ్(N)
ఒక వర్షపు రాత్రి
Published Sun, May 15 2016 4:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్‌పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
Advertisement