పడినా లేచింది! | I want to be known as a good actress: Suhasini | Sakshi
Sakshi News home page

పడినా లేచింది!

Feb 13 2016 11:07 PM | Updated on Sep 3 2017 5:34 PM

పడినా లేచింది!

పడినా లేచింది!

సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్ రావడం అంత తేలిక కాదు. ఒకవేళ వచ్చినా... హీరోయిన్‌గా స్థిరపడటం అన్నది అంత సులువూ కాదు.

సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్ రావడం అంత తేలిక కాదు. ఒకవేళ వచ్చినా... హీరోయిన్‌గా స్థిరపడటం అన్నది అంత సులువూ కాదు. అందుకే ఎంతోమంది అమ్మాయిలు ఒకట్రెండు సినిమాలు చేసి మాయమైపోతుంటారు. సుహాసిని విషయంలోనూ అదే జరిగింది. ‘చంటిగాడు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సక్సెస్‌ను చవి చూసింది. కొన్ని అవకాశాలనూ అందుకుంది. కానీ నిలదొక్కుకోలేకపోయింది.

అయితే తను చాలామంది లాగా ఇంకా అవకాశాలు వస్తాయేమో అని చూస్తూ కూచో లేదు. సినిమాలు మాత్రమే చేస్తానంటూ మడి కట్టుకు కూర్చోలేదు. బుల్లితెర వైపు దృష్టి సారించింది. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంది. సీరియళ్లలో బిజీ అయి పోయింది. ‘అపరంజి’తో మొదలైన ఆమె టెలివిజన్ విజయ ప్రస్థానం... నిరాటంకంగా కొనసాగిపోతూనే ఉంది.

ఒకే సమయంలో రెండు మూడు సీరియళ్లలో పని చేస్తూ... తన కెరీర్‌గ్రాఫ్ ఇక్కడ కూడా పడిపోకుండా చక్కగా నిలబెట్టుకుంటోంది సుహాసిని. పడినా లేవడం అంటే ఏమిటో మిగతా వాళ్లకి చూపిస్తోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement