సుహాసిని ఫోన్‌ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు | Parthiban: One Day Suhasini Called me and Says This | Sakshi
Sakshi News home page

Suhasini: సుహాసిని ఫోన్‌ చేసి మరీ చెప్పింది.. 50 ఏళ్ల వయసులో..

Jun 11 2025 1:19 PM | Updated on Jun 11 2025 1:31 PM

Parthiban: One Day Suhasini Called me and Says This

మల్టీ టాస్కింగ్‌ అన్న పదానికి పర్ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ పార్తీబన్‌ (R. Parthiban). అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్‌గా తన ప్రతిభ చాటుకున్నారు. యుగానికి ఒక్కడూ, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌ వంటి పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. తాజాగా ఆయన హీరోయిన్‌ సుహాసినిపై ప్రశంసలు కురిపించాడు. వర్డిక్ట్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పార్తీబన్‌ మాట్లాడుతూ.. అందరూ సుహాసిని యాక్టింగ్‌ గురించే మాట్లాడుకుంటారు. 

ఓరోజు ఫోన్‌ చేసి..
కానీ తన ఆత్మవిశ్వాసం గురించి మీకు చెప్పాలి. ఒకరోజు ఆమె నాకు ఫోన్‌ చేసి పార్తీబన్‌.. ఈరోజు నాకు 50 ఏళ్లు నిండాయి అని చెప్పింది. అసలు ఏ మహిళ కూడా 28 ఏళ్లు దాటాక తన వయసు చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తనకు 50 ఏళ్లు అని నిర్మొహమాటంగా చెప్పిందంటే అది తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. 50 ఏళ్లు వచ్చినా తనెంత అందంగా ఉందో మీరే చూడండి అనడంతో అక్కడే స్టేజీపై ఉన్న సుహాసిని (Suhasini) సరదాగా నవ్వేసింది.

సినిమా
వర్డిక్ట్‌ సినిమా విషయానికి వస్తే.. పార్తీబన్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాసిని కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌, విద్యుల్లేఖ, ప్రకాశ్‌ మోహన్‌దాస్‌ తదితరులు నటిస్తున్నారు.

చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement