చంద్రబింబం:ఏప్రిల్ 27 నుండి మే 03 వరకు | Funday Book: Astrology of the week | Sakshi
Sakshi News home page

చంద్రబింబం:ఏప్రిల్ 27 నుండి మే 03 వరకు

Apr 27 2014 4:06 AM | Updated on Sep 2 2017 6:33 AM

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికరంగం వారు ఆశించిన ప్రగతి సాధిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
 
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంతకాలం వేధించిన సమస్య పరిష్కారమవుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకువేస్తారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు సమకూరతాయి. పెద్దల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు, ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు పెరిగి మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆలోచనల అమలులో కొద్దిపాటి ఆటంకాలు. భూములు, గృహం కొనుగోలు యత్నాలు నిదానంగా సాగుతాయి.  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. పారిశ్రామికరంగం వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. వారం మధ్యలో  ఆకస్మిక ధన, వస్తులాభాలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 పనులు మందకొడిగా సాగుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు.  ప్రయాణాలలో మార్పులు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. కళారంగం వారు కొంత నిదానం పాటించాలి. వారం ప్రారంభంలో విందువినోదాలు. ఆస్తి లాభం.
 
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 పనుల్లో విజయం. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. మీసేవలకు తగిన గుర్తింపురాగలదు. విద్యార్థుల పరిశోధనలు ఫలిస్తాయి. ఆస్తి విషయాలలో కొత్త ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే అవకాశం. కళారంగం వారికి అవార్డులు దక్కుతాయి. వారం చివరిలో ధ నవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు సమకూరతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రశంసలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆస్తివివాదాలు. పనుల్లో ఆటంకాలు.
 
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయరంగం వారికి ఉత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. అనారోగ్యం.
 
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపార లావాదేవీలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు విధులు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనల్లో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి.
 
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు.  నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమఫలిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికరంగం వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

 

Advertisement
 
Advertisement
Advertisement