అందాల రాశిలా | Funday beauty tips 28-04-2019 | Sakshi
Sakshi News home page

అందాల రాశిలా

Apr 28 2019 12:31 AM | Updated on Apr 28 2019 12:31 AM

Funday beauty tips 28-04-2019 - Sakshi

సహజసిద్ధమైన అందం నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే మచ్చలు, మొటిమలు లేని మృదుత్వం శాశ్వతంగా నిలవాలంటే ఏం చెయ్యాలి? ఇది చాలా మందికి తలెత్తే సమస్యే. పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. అందాల రాశిలా మెరవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి: క్లీనప్‌ : రోజ్‌ వాటర్‌ – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, స్క్రబ్‌ : పెసరపిండి – అర టేబుల్‌ స్పూన్, చిక్కటి పాలు – అర టేబుల్‌ స్పూన్, మాస్క్‌:  క్యారెట్‌ గుజ్జు – రెండు టీ స్పూన్లు, కొబ్బరి పాలు – 1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు

తయారీ: ముందుగా రోజ్‌వాటర్, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, చిక్కటిపాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు  క్యారెట్‌ గుజ్జు, కొబ్బరిపాలు, ముల్తానీ మట్టి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement