సిగరెట్ ప్రిస్క్రిప్షన్ | Cigarette prescription | Sakshi
Sakshi News home page

సిగరెట్ ప్రిస్క్రిప్షన్

Jan 25 2015 1:10 AM | Updated on Oct 22 2018 2:14 PM

సిగరెట్ ప్రిస్క్రిప్షన్ - Sakshi

సిగరెట్ ప్రిస్క్రిప్షన్

‘పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్’ అంటూ ‘కన్యాశుల్కం’లో గిరీశం, ‘అగరొత్తులు ఎన్ని ఉన్న సిగరెట్టుకు సాటిరావు’ అంటూ...

పొగ మందు
‘పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్’ అంటూ ‘కన్యాశుల్కం’లో గిరీశం, ‘అగరొత్తులు ఎన్ని ఉన్న సిగరెట్టుకు సాటిరావు’ అంటూ మహాకవి తన ‘సిరిసిరిమువ్వ’ శతకంలో చెప్పిన మాటలు సాహిత్యంలో హాస్యంగానే చలామణీ అయ్యాయి గానీ, ఒకానొక కాలంలో సిగరెట్లు మంచివేనంటూ సాక్షాత్తు వైద్యులే సలహా ఇచ్చేవారు. నోటి దుర్వాసన నుంచి విముక్తికి, కేన్సర్‌కు విరుగుడుగా 16వ శతాబ్దిలో యూరోప్‌లోని వైద్యులు తమ రోగులకు సిగరెట్లనే సిఫారసు చేసేవారు.

ఐదు శతాబ్దాల తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. సిగరెట్ ప్యాకెట్లపై తొలుత కనీకనిపించని అక్షరాలతో ‘చట్టబద్ధమైన’ హెచ్చరికలు ఉండేవి. కొన్నేళ్లుగా ఈ హెచ్చరికలను సచిత్రంగా, ప్రస్ఫుటంగా పొగరాయుళ్లను భయపెట్టేలా ముద్రించడం మొదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement