చక్కనమ్మ చిక్కటానికి చిట్కాలు ఇవే | Beauty Tips To Womens To Become More Beautiful In Funday | Sakshi
Sakshi News home page

చక్కనమ్మ చిక్కటానికి చిట్కాలు ఇవే

Oct 13 2019 11:12 AM | Updated on Oct 13 2019 11:12 AM

Beauty Tips To Womens To Become More Beautiful In Funday - Sakshi

అమ్మాయి నడుముని సింహకటితోనూ, చేతులను తామర తూడులతోనూ, తొడలను అరటి బోదెలతోనూ పోల్చడం మన ప్రాచీనకవులకు అలవాటే. అమ్మాయి అందంగా ఉండాలంటే నునుపైన మేను, ముఖ సౌందర్యం ఉంటే సరిపోదు, పర్సనాల్టీకి సరిపడా మెజర్మెంట్స్‌ ఉండాలి అనేది ఇప్పటికీ వినిపిస్తున్న మాట. అందుకే చాలామంది స్త్రీలు.. సన్నగా, నాజూగ్గా.. ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్సర్‌సైజ్‌లు, యోగాసనాలు వేస్తూ చాలా కష్టపడుతుంటారు. అయితే అందుకు సమయం ఉండాలిగా. కాస్తైనా తీరిక లేని ఈ ఉరుకుల పరుగుల కాలంలో నెలల తరబడి క్రమం తప్పకుండా గంటల గంటలు వ్యాయామాలు చేయలేక, పెరిగిన అదనపు కొవ్వుని తగ్గించుకోలేక ఇబ్బంది పడేవాళ్ల కోసమే ఈ బాడీ మసాజర్‌.

దీన్ని రెండు వేళ్ల మధ్య పట్టుకుని ఎక్కడ అవసరం లేని కొలెస్ట్రాల్‌ ఉందో అక్కడ ఇస్త్రీ చేసినట్లుగా జరుపుతూ ఉంటే చాలు. ఈ పరికరం అచ్చు చూడ్డానికి కంప్యూటర్‌ మౌస్‌లా ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి వీలుగా దాని పైన ఒక ప్రత్యేకమైన బటన్‌ ఉంటుంది. దాని మీదే పవర్‌ ఆన్‌ బటన్, ప్లస్, మైనెస్‌ బటన్స్‌ ఉంటాయి. వాటి సహాయంతో దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ (ఔఉఆౖఈ్గ) బాడీ మాసాజర్‌తో పాటూ నాచురల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌తో రూపొందిన ఔఉ క్రీమ్‌ కూడా లభిస్తాయి. ముందుగా దాన్ని శరీరానికి రాసుకుని ఆ తర్వాత ఈ మాసాజర్‌తో మసాజ్‌ చేసుకోవాలి. దీనిలోని మల్టీ ఫ్రీక్వెన్సీ శరీరంలోని కండరాలను బలపరుస్తుంది. మొత్తం ఈ మోడల్‌ మసాజర్‌లో ఐదు లేదా ఆరు ఫ్రీక్వెన్సీ లెవల్స్‌ ఉంటాయి.

మసాజ్‌ చేసుకునే సమయంలో అవసరాన్ని బట్టి మెల్లగా పెంచుకోవచ్చు. వ్యాయామం అలవాటు ఉన్న వారికి జిమ్‌ మోడ్‌ని, వ్యాయామం అలవాటు లేని వారికి స్లిమ్‌ మోడ్‌ని ఇది సూచిస్తుంది. ధరను బట్టి కొన్ని మసాజర్స్‌కి ప్రత్యేకమైన బెల్ట్‌ కూడా లభిస్తుంది. దాంతో నడుము లేదా తొడలకు సెట్‌ అయ్యేలా అడ్జెస్ట్‌ చేసుకుని కొవ్వు తగ్గించుకోవచ్చు. ఇవి 499 డాలర్లు అనగా 35,433 రూపాయలకు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ ఇచ్చిన ధర సుమారుగా చెబుతున్నదే. మోడల్‌ని బట్టి, అదనపు సౌకర్యాలని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement