టేస్ట్ హైట్ | Taste and hight over Hyderabad fine dining restaurant | Sakshi
Sakshi News home page

టేస్ట్ హైట్

Jan 31 2015 11:48 PM | Updated on Oct 5 2018 6:36 PM

టేస్ట్ హైట్ - Sakshi

టేస్ట్ హైట్

చార్మినార్‌లోని నాలుగు మినార్‌లు మనకు తెలుసు.

చార్మినార్‌లోని నాలుగు మినార్‌లు మనకు తెలుసు. నగరంలో మరో ఏక్‌మినార్ వెలిసింది. 423 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలను మరింత ‘ఎత్తుకు’ తీసుకెళ్తూ ఏర్పాటైనదే ‘ద మినార్’ హైదరాబాద్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్. వంద అడుగుల ఎత్తులో కూర్చుని నగర అందాలతో పాటు సంప్రదాయ  వంటకాల రుచి చూడాలనుకుంటే గండిపేట
 సమీపంలోని గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్లాల్సిందే...  
 
 హైదరాబాద్ సంప్రదాయ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తోందీ రెస్టారెంట్. లోపలికి ప్రవేశించగానే నవాబీ తరహాలో ముత్యాల హారాన్ని మెడలో వేస్తూ స్వాగతం పలుకుతుంది. లిఫ్ట్‌లో పైన ఉన్న రెస్టారెంట్‌కు చేరుకోగానే... కుర్తాపైజమాల్లో ఉన్న వెయిటర్స్ చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. లోపల హైదరాబాద్ చరిత్రను కనులకు కట్టే ఇంటీరియర్స్. చుట్టూ గ్లాస్ విండోస్. అందులోంచి నగర అందాలు మనకు కనువిందు చేస్తాయి. ఓవైపు పల్లె వాతావరణాన్ని తలపించే గండిపేట చెరువు, మరోవైపు హైటెక్ సొగసులద్దుకున్న గచ్చిబౌలి... మొత్తానికి గాల్లో తేలుతున్న అనుభూతి. రాత్రి సమయాల్లో విద్యుత్ కాంతుల వెలుగుల్లో నగరం... కార్తీక మాసంలో వేల దీపాలను దాచుకున్న కొలనును తలపిస్తోంది.
 
 హైదరాబాదీలు ఎంత ఫుడ్ లవర్సో... అంతే ఇన్నోవేటివ్ కూడా. అందుకే ఇటీవలే ఏర్పాటైన ఈ మినార్‌లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్స్‌లో రద్దీ ఉంటోంది. ఇక కుటుంబ సమేత పార్టీలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. పసందైన విందుతో విదేశీయులను సైతం విస్తుపోయేలా చేస్తుందీ రెస్టారెంట్. ఒకేసారి 77 మంది కూర్చుని భోజనం చేసే సౌకర్యం ఇక్కడ ఉంది. మినార్... ఎక్స్‌క్లూజివ్ ఫర్ హైదరాబాదీ ఫుడ్. వెజ్, నాన్‌వెజ్, సీఫుడ్ మూడు ప్యాకేజీలను వడ్డిస్తోంది. హైదరాబాదీ రుచుల్లో బాగమైన బార్‌కాస్ పత్తర్‌కా గోష్, హైదరాబాద్ దమ్‌కా ముర్గా, ముర్గా దమ్ బిర్యానీ, హలీమ్, హైదరాబాద్ దమ్ కా మటన్ బిర్యానీ, కబాబ్‌లు తదితర వెరైటీలు అందుబాటులో ఉన్నాయి.
 - ఎ.రాజేందర్‌రెడ్డి, మణికొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement