ఇదోరకం జబ్బండీ

ఇదోరకం జబ్బండీ


నూటికొక్కరికి జబ్బొస్తే అయ్యో అంటాం. నూటికి 80 మంది జబ్బుపడితే ఏం చెప్పాలో డాక్టర్లకే తెలియడం లేదు. ఇది తిండిలేక వచ్చే జబ్బు కాదు, తిండి ఎక్కువైనా వచ్చే జబ్బు అంతకన్నా కాదు. పోనీ ఏసీ గదుల్లోనే ఉంటూ ఆరోగ్యంగా ఉందామనుకునే వాళ్లంటే ఈ జబ్బుకు మరింత మంట. పోనీ జబ్బు ఉందో లేదో తెలుసుకోవాలన్నా పెద్దగా లక్షణాలు కనిపించవు. ఇదేంటని ఆరా తీస్తే..‘డి’ విటమిన్ లోపం. పొద్దున్నే కాసేపు ప్రత్యక్ష నారాయణుడ్ని దర్శించుకోని పాపం ఇప్పుడు సిటీవాసులను పీడిస్తోంది. ఎక్కడ కందిపోతామోనని ఎండ కన్నెరగకపోతే.. మీరూ ఈ రోగాన్ని ఆహ్వానించినట్టే.

 

కేవలం ఎండలో తిరగక పోవడంతో వచ్చే జబ్బు ఇది. చూడ్డానికి చాలా చిన్న సమస్యగా ఉంది గానీ, నగరంలో లక్షలాది మంది ‘డి’విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.ఎక్కువగా స్కూలు చిన్నారుల్లో ఇది కనిపిస్తోంది. ఇటీవల  ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యులకు రక్తపరీక్షలు చేస్తే 90 శాతం మందిలో డి విటమిన్ లోపం ఉందని తేలింది. ఈ జబ్బును అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.చంద్రశేఖర్‌రెడ్డి.

 

హైదరాబాద్ లాంటి నగరంలో 80 శాతం మంది ‘డి’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ఆయన అంటున్నారు. చిన్నపిల్లలు, పాలిస్తున్న తల్లులు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ‘డి’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. శరీరంలో 30 నానో గ్రామ్స్ (పర్ మిల్లీ లీటర్) కంటే తక్కువగా ‘డి’ విటమిన్ ఉంటే  లోపం ఉన్నట్టు.

 

ప్రతి 100 మందికి 80 మంది డి విటమిన్ బాధితులే 90 శాతం మంది బాధితులు సూర్యకాంతి అందకనేనగరంలో 70 లక్షల నుంచి 80 లక్షల మంది బాధితులు ఉన్నట్టు అంచనా40 శాతం మంది చిన్నారులు, మహిళలున్నారు 10 శాతం మంది వృద్ధులు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు

 

 ‘డి’ విటమిన్ లోపంతో సమస్యలు

* ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి

* కండరాలు తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటాయి

* శారీరక అలసట కలుగుతుంది

* చిన్నారులు రికెట్స్ వ్యాధి బారిన పడతారు

* ఒళ్లు నీరసంగా అనిపిస్తుంది.. పని మీద ఏకాగ్రత ఉండదు

* వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది

* తాజా పరిశోధనల ప్రకారం గుండెపోటుకూ ‘డి’ విటమిన్ లోపం కారణమవుతోంది

* మధుమేహం రావడానికి సైతం అవకాశం ఉంది

 

 సూర్యకాంతి మందు

* సూర్యకాంతి ద్వారా మాత్రమే శరీరానికి కావాల్సినంత డి విటమిన్ లభిస్తుంది

* రోజూ కనీసం 45 నిమిషాలు ఎండలో తిరిగితే చాలు

* నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుందని తేలింది. బ్లాక్ స్కిన్ ఉన్నవారిలో మెల నోసైట్స్ అనే పదార్థం ఉండటంతో వారి శరీరంలోకి సూర్యకాంతి తొందరగా వెళ్లదు.

* మూర్ఛ వ్యాధికి మందులు వాడే వారిలోనూ  డి విటమిన్  లోపం ఉంటుంది

* సాల్మన్, మెకరల్, ట్యూనా చేపలు తినడం వల్ల డి విటమిన్‌ను కొద్దివరకూ పొందచ్చు

* పుట్టగొడుగులు, కాడ్‌లివర్ ఆయిల్‌లోనూ డి విటమిన్ ఉంటుంది

* డి విటమిన్ 30 నుంచి 100 నానోగ్రామ్స్ (పర్ మిల్లీ లీటర్) ఉంటే సరిపోయినట్టు

*  కేవలం రక్త పరీక్ష ద్వారానే డి విటమిన్ లోపం తెలుసుకోగలం

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top