వెర్బాటిమ్ ఎల్‌ఈడీ ప్రోడక్ట్స్ | Prakash Lights showroom is care off for good lights | Sakshi
Sakshi News home page

వెర్బాటిమ్ ఎల్‌ఈడీ ప్రోడక్ట్స్

Sep 28 2014 1:31 AM | Updated on Sep 2 2017 2:01 PM

వెర్బాటిమ్ ఎల్‌ఈడీ ప్రోడక్ట్స్

వెర్బాటిమ్ ఎల్‌ఈడీ ప్రోడక్ట్స్

అందమైన ఇల్లు అంటే అందరికీ ఇష్టమే. రూ. లక్షలు ఖర్చు చేసి మరీ నిర్మించినా ఇంటిలో సరైన లైట్ మోడల్స్ లేకుంటే అసంతృప్తే.

అందమైన ఇల్లు అంటే అందరికీ ఇష్టమే. రూ. లక్షలు ఖర్చు చేసి మరీ నిర్మించినా ఇంటిలో సరైన లైట్ మోడల్స్ లేకుంటే అసంతృప్తే. కేవలం వాల్ పెయింట్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్‌పైనే ఇంట్రెస్ట్ చూపే ఇంటి యజమానులు ప్రజెంట్ లైంటింగ్‌పై కూడా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. డిఫరెంట్ మోడల్స్ లైట్లను కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడ్రన్ లైట్లు నగర మార్కెట్‌లో హల్‌చల్ చేశాయి. అయితే కస్టమర్ల అభిరుచికి, ఆదరణకు అవి నోచుకోలేక పోయాయి.

న్యూ లుక్, డిఫరెంట్ మోడల్స్, క్వాలిటీ కోరుకుంటున్న కస్టమర్ల కోసం విదేశాల నుంచి ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన లైట్లను విక్రయిస్తోంది నగరానికి చెందిన ‘ప్రకాశ్ లైట్స్’. 58 ఏళ్లుగా హైదరాబాదీలకు వెలుగులు పంచుతోంది. నగరవాసుల ఇళ్లకు వెలుగులు చేర్చాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు బంజారాహిల్స్ రోడ్ నం:1, అబిడ్స్, మొజాంజాహి మార్కెట్‌లో తన బ్రాంచ్‌లను నెలకొల్పింది. త్వరలోనే గచ్చిబౌలిలో అతిపెద్ద షోరూమ్ ఏర్పాటు చేయనున్నామని ‘ప్రకాశ్ లైట్స్’ యజమాని విక్రమ్ మెహతా తెలిపారు. సినీస్టార్స్ నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ ఇళ్లకు ఇంపోర్టెడ్ లైట్లను తామే సరఫరా చేశామని తెలిపారు.

ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి కేరాఫ్
ఇప్పుడు ఎక్కడ చూసినా లెడ్ మయమే. లెడ్ బేస్డ్‌గా వివిధ కంపెనీలు డిఫరెంట్ లైట్స్‌ని మార్కెట్లోకి తెస్తున్నాయి. మిత్సుబిషి, ఎగ్లో, లెడ్-సీ4, స్వరాస్కి, సామ్‌సంగ్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి చెందిన లైట్స్‌కి ‘ప్రకాశ్ లైట్స్’ షోరూం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. క్రిస్టల్ చాన్‌డ్లియెర్స్, డెకరేటివ్, వాల్, మిర్రర్, స్పాట్, ఫోల్సర్ లెడ్, కార్నర్ హ్యాంగింగ్, పార్టీషన్ క్రిస్టల్స్, ఫ్లోర్, అండర్ వాటర్ లైట్స్ లభించే షోరూంగా భాసిల్లుతోంది. ఫ్యాబ్రిక్, బ్లూమ్ గ్లాస్, కాపర్ షీట్, వీనియర్ వంటి మెటీరియల్‌తో తయారు చేసిన బల్బులు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ వ్యయంలో  కొద్ది శాతం వెచ్చిస్తే చాలు మీ ఇంట్లో వెలుగులు ప్రకాశిస్తాయంటున్నారు విక్రమ్ మెహతా.
 
మిత్సుబిషి కెమికల్ హోల్డింగ్స్ గ్రూప్ ఉత్పాదనలైన వెర్బాటిమ్ ఎల్‌ఈడీ ప్రోడక్ట్స్‌ను పరిచయం చేస్తున్నారు  ప్రకాష్ లైట్స్‌వారు. వీరి స్పెషల్ బల్బులు, స్పాట్స్, డౌన్ లైటర్లు వంటి ఉత్పత్తులన్నీ భారత్‌లో అవసరమైన క్వాలిటీ సర్టిఫికేషన్ ఆమోదం పొందా యి. వెర్బాటిమ్ ఉత్పత్తులన్నింటికీ మూడేళ్ల వారంటీ ఉంటుంది. ఆఫీసు లేదా నివాస భవనాలకు లైటింగ్ కోసం కన్సల్టెన్సీ సేవలు కూడా అందిస్తున్నారు. ఆకర్షణీయమైన ధరల్లో లభించే మిత్సుబిషి ఉత్పత్తులు ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో పోల్చుకుంటే నాణ్యతలోనూ అత్యుత్తమమైనవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement