హాస్య యోగా... చేయి బాగా!

హాస్య యోగా... చేయి బాగా!


నవ్వు నాలుగు విధాల మేలు అనేది నాటి మాటయితే, నవ్వు నలభై విధాల గ్రేటు అనేది నేటి నినాదం. రోజు హాయిగా నవ్వే వారు రోగాలకు బారిన పడకుండా ఉంటారనేది జగమెరిగిన సత్యం. మనసారా నవ్వుకునే వారికి వైద్యుడికి దగ్గర వెళ్లాల్సిన సందర్భాలు తక్కువగా వస్తాయి. అన్నింటా వేగమే చెలామణి అవుతున్న గ్లోబల్ ప్రపంచంలో మనిషి దరహాసానికి దూరమవుతున్నాడు. చిరునవ్వుకు కూడా సమయం చిక్కనంత బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా నగరజీవులు నవ్వమే మర్చిపోతున్నారు.ఇటువంటి వారి కోసం నగరాల్లో లాఫీంగ్ క్లబ్సులు వెలిశాయి. మొదట నవ్వు కోవడానికే పరిమితమియిన ఈ క్లబ్బులు కాలానుగుణం మార్పులు చెందాయి. ఇప్పుడు ఎక్కువగా హాస్య యోగా చేస్తున్నారు. ఇందులో జోక్స్ వేసి నవ్వించడం ఉండదు. యోగా బ్రీతింగ్తో పాటు లాఫింగ్ ఎక్స్ర్సైజ్ చేయడం దీని ప్రత్యేకత. మనదేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పుడు హాస్య యోగా బాగా ప్రాచుర్యం పొందింది. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు హాస్య యోగా చేస్తే అనారోగ్యం దూరమవడమే కాకుండా మానసిక సాంత్వన కలుగుతుందంటున్నారు నిపుణులు.మెట్రో నగరాల్లో జీవించే వారిలో అత్యధిక శాతం మంది ఒత్తిడితో కూడిన జీవితం గడుపుతున్నారు. ఉద్యోగ జీవితం పోటీ వాతావరణం, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలతో నగరజీవులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు నవ్వుకు దూరమవుతున్నారు. నవ్వు కూడా ఒక వ్యాయామమే అన్న సంగతి మర్చిపోతున్నారు. అసలు చిన్న పిల్లల్లా మనసారా నవ్వుకుంటే ఒత్తిడి దూది పింజల ఎగిరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా నవ్వలేని వారు హాస్య యోగాను ఆశ్రయిస్తున్నారు.  హాస్య యోగాతో మానసిక ఒత్తిడి దూరమవడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హాస్య యోగా కేంద్రం వ్యవస్థాపకుడు జితెన్ కోహి తెలిపారు. మనసారా నవ్వితే ముఖ కండరాలకు వ్యాయామం అవుతుందని, దీంతో ముఖవర్చసు ద్విగుణీకృతం అవుతుందన్నారు. ముఖ్యంగా అందరితో కలిసి హాస్య యోగా చేయడం వల్ల దేహం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయి ఒత్తిడి తొలగిపోతుందని వివరించారు. నవ్వుతో మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా, రోగాలు నయమవుతాయన్నారు. తమ క్లబ్బులో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కూడా హాస్య యోగాకు ఆదరణకు పెరుగుతోందన్నారు. అయితే హాస్య యోగాతో వ్యాధులు పూర్తిగా నయమైపోవని, తగిన వైద్య చికిత్స కూడా అవసరమని చెప్పారు. హాయిగా నవ్వేవారిలో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. మరి ఇంకేందుకు ఆలస్యంగా హాః హాః హాః అంటూ నవ్వండి ఆరోగ్యంగా ఉండండి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top