కాండీ టచ్! | రkim kardashian on the internet | Sakshi
Sakshi News home page

కాండీ టచ్!

Mar 11 2015 12:46 AM | Updated on Sep 2 2017 10:36 PM

వింత వింత చేష్టలు... గెటప్‌లతో ఎప్పుడూ న్యూస్‌లో ఉండే అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది.

 వింత వింత చేష్టలు... గెటప్‌లతో ఎప్పుడూ న్యూస్‌లో ఉండే అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు తన అందచందాలతో అలరించిన అమ్మడు... లేటెస్ట్‌గా హెయిర్ కలర్ మార్చి, ఆ పిక్చర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది. ఇక చెప్పేదేముంది..! ఒకటే లైకులు... షేర్లు... కామెంట్లు! ‘వాస్తవానికి మడోనా హెయిర్ కలర్ నన్ను బాగా ఇంప్రస్ చేసింది. ఆ ప్రభావంతోనే నేనూ జుట్టు రంగు మార్చుకున్నా. ప్లాటినమ్ హెయిర్‌డ్ మడోనా పిక్చర్ ఎప్పుడూ నా కంప్యూటర్ రిఫరెన్స్ ఫోల్డర్‌లో ఉంటుంది. ఈ లుక్ కోసం చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కంటే పెద్ద సందర్భం ఏముంటుంది! కానీ... ఈ నిర్ణయం ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. లాస్ట్ మినిట్‌లో తీసుకున్నది’ అంది కిమ్!
 

Advertisement
 
Advertisement
Advertisement