గ్రాండ్ వెల్కమ్ | Grand welcome | Sakshi
Sakshi News home page

గ్రాండ్ వెల్కమ్

Feb 6 2015 12:05 AM | Updated on Apr 3 2019 6:23 PM

గ్రాండ్ వెల్కమ్ - Sakshi

గ్రాండ్ వెల్కమ్

ఓ పిల్లకు తల్లి అయిన బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యారాయ్ చాలా కాలం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించిందట.

ఓ పిల్లకు తల్లి అయిన బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యారాయ్ చాలా కాలం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించిందట. సంజయ్‌గుప్తా ‘జజ్‌బా’లో ఐష్ ఓ లాయర్ పాత్రలో కనిపిస్తుంది. ఇర్ఫాన్‌ఖాన్ సస్పెండెడ్ కాప్‌గా, షబనా ఆజ్మీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ముంబైలో బిజీగా ఉండే జుహూలో షూటింగ్ జరుగుతోంది.

ఐశ్వర్య, ఇర్ఫాన్‌ల మధ్య వాడివేడి సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నీలి కళ్ల సుందరి తన నటనతో అందరి హృదయాలూ కొల్లగొట్టేసిందట. చాన్నాళ్ల తరువాత అమ్మడి పెర్‌ఫార్మెన్స్ లైవ్‌లో చూసిన యూనిట్ సభ్యులంతా నిలుచుని చప్పట్లు కొట్టి అభినందించారట!
 

Advertisement
 
Advertisement
Advertisement