అలా చూసినా బుక్కవుతారు..

Google And Facebook Are Tracking Pornographic Habit Of Users - Sakshi

న్యూయార్క్‌ : రహస్య (ఇన్‌కాగ్నిటో) మోడ్‌లో అశ్లీల సైట్లలో విహరించినా యూజర్ల గుట్టును గూగుల్‌, ఫేస్‌బుక్‌ సహా పలు కంపెనీలు ఇట్టే ఒడిసిపడుతున్నాయి. తాము పోర్న్‌ చూస్తున్నట్టు ఎవరికీ తెలియదని ప్రైవేట్‌ బ్రౌజింగ్‌లో అశ్లీల సైట్లను చూసినా వారి బ్రౌజింగ్‌ హిస్టరీని ఆయా కంపెనీలు పసిగడుతున్నాయని మైక్రోసాఫ్ట్‌, కార్నిగీ మెలన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా చేపట్టిన సంయుక్త అథ్యయనంలో వెల్లడైంది.

పరిశోధకులు విశ్లేషించిన 22,484 అశ్లీల సైట్లలో 93 శాతం సైట్లు థర్డ్‌ పార్టీ యాప్స్‌కు డేటాను లీక్‌ చేసినట్టు అథ్యయనంలో వెల్లడైంది. ప్రైవసీ పాలసీల్లో ఉన్న సంక్లిష్టతల కారణంగా యూజర్ల అనుమతి లేకుండా ట్రాకర్లు ఆయా కంపెనీలకు పంపుతున్న డేటా ద్వారా యూజర్ల వ్యక్తిగత అలవాట్లు, శృంగార ప్రాధాన్యతలు తెలసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. అశ్లీల సైట్స్‌లో 93 శాతం పేజీలు యూజర్‌ డేటాను థర్డ్‌ పార్టీకి చేరవేస్తున్నాయని, 79 శాతం థర్డ్‌ పార్టీ కుకీల(ట్రాకింగ్‌ కోసం ఉపయోగించే)ను కలిగి ఉన్నాయని అథ్యయనం వెల్లడించింది.

అశ్లీల సైట్లలో కేవలం 17 శాతం సైట్లు మాత్రమే సమాచార భద్రతను కలిగి ఉన్నాయని తేలింది. యూజర్లను ట్రాక్‌ చేస్తున్నట్టు గుర్తించిన టాప్‌ టెన్‌ థర్డ్‌ పార్టీల జాబితాలో ఎక్సోక్లిక్‌, జ్యూసీయాడ్స్‌, ఈరో అడ్వర్టైజింగ్‌లున్నాయని తెలిపింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌లు నాన్‌-పోర్నోగ్రఫీ-స్పెసిఫిక్‌ సర్వీసుల జాబితాలో ఉన్నాయి. గూగుల్‌ ఈ జాబితాలో ఉన్నప్పటికీ యూజర్ల అశ్లీల సైట్లలో విహరించే అలవాట్లను వారికి తెలియకుండానే పరిశీలిస్తున్నట్టు అథ్యయనం వెల్లడించింది. ఒరాకిల్‌ 24 శాతం అశ్లీల సైట్లను వీక్షించే యూజర్లను ట్రాక్‌ చేస్తున్నట్టు ఈ అథ్యయనం పేర్కొంది. పరిశోధకులు వెబ్‌ఎక్స్‌రే సాఫ్ట్‌వేర్‌ ఫ్లాట్‌ఫాంను ఉపయోగించి యూజర్ల డేటాను సమీకరిస్తున్న కంపెనీలను గుర్తించారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top