
గోముఖాసనం
సమస్థితిలో కూర్చుని రెండుకాళ్లను ముందుకు చాచి ఉంచాలి. కుడిమోకాలిని వంచి కుడికాలి మడమను ఎడమ పిరుదుకు ఆనించాలి. ఇప్పుడు ఎడమ మోకాలిని
గోవు అంటే ఆవు. గోముఖాసన భంగిమ ఆవు ముఖాకృతిని పోలి ఉంటుంది. కాబట్టి దీనిని గోముఖాసనం అంటారు.
ఎలా చేయాలి?
సమస్థితిలో కూర్చుని రెండుకాళ్లను ముందుకు చాచి ఉంచాలి. కుడిమోకాలిని వంచి కుడికాలి మడమను ఎడమ పిరుదుకు ఆనించాలి. ఇప్పుడు ఎడమ మోకాలిని వంచి ఎడమ పాదాన్ని కుడి పిరుదుకు ఆనించాలి. చేతులను కుడిమోకాలి మీద ఉంచాలి.కుడిచేతిని పెకైత్తి మోచేతిని వంచి (ఫొటోలో ఉన్నట్లు) అరచేతిని వీపు వెనుక బోర్లించి ఉంచాలి. ఎడమ చేతిని వెనక్కు తీసుకుని కుడిచేతి వేళ్లతో కలిపి పట్టుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. యథాస్థితికి వచ్చేటప్పుడు ముందుగా ఎడమచేతిని వదిలించుకుని ఆ తర్వాత కుడిచేతిని మామూలు స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత కాళ్లను వదులు చేసి సమస్థితికి రావాలి. ఇప్పుడు ఎడమమోకాలిని మడిచి, ఎడమభుజాన్ని పైకి లేపి కూడా సాధన చేయాలి. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.