మళ్లీ వస్తున్న దీపావళి!

బాల
సినీతారలు బాగా ఇష్టపడే పండుగ దీపావళి. ఇంటింటా దీపాలు వెలిగించి, ఆకాశంలోని తారకలతో పోటీపడతారు. ఇతర సెలబ్రిటీస్‌ని పిలిచి పార్టీలు చేసుకుంటారు. స్వస్థలాలకు చేరుకుని, బాణసంచా కాల్చుతూ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. యామీ గౌతమ్‌కి కూడా అలా ఇంటికి వెళ్లి, అందరితో కలిసి ఆనందంగా దీపావళి జరుపుకోవడం చాలా ఇష్టమట. అయితే కుటుంబం చండీగఢ్‌లో ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా యామీ తన తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపడానికి ఇంటికి వెళ్లారు.
రెండు రోజుల పాటు అక్కడే ఉండి అనుబంధాల రుచులు తిని వద్దామనుకున్నారు. కాని పండుగ జరుపుకోలేకపోయారు! దగ్గర బంధువులు దీపావళి రోజునే గతించడంతో, ఆ రోజంతా అక్కడే గడిచిపోయింది. ‘ఈ సంవత్సరం దీపావళికి మా ఇంట్లో స్వీట్స్ లేవు, దీపాలు లేవు, టపాసులు లేవు. ఏమీ లేవు’ అన్నారు యామీ. ఆయుష్మాన్ ఖురానా, భూమీ పెడ్నేకర్‌లతో తెర మీద కనిపించబోతున్న యామీ.. ‘బాల’ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఆ దీపావళి వెలుగులు లేకపోయినా, ఈ చిత్రం విజయం సాధించి, యామీ ముఖంలో వెన్నెల కాంతులు కురిస్తే, యామీ దీపావళి జరుపుకున్నట్లేగా. ‘బాల’ ఈనెల 7న విడుదల అవుతోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి