అడవి వరి..  తీరుస్తుందా ప్రపంచం ఆకలి? | The wild rice is the world hungry? | Sakshi
Sakshi News home page

అడవి వరి..  తీరుస్తుందా ప్రపంచం ఆకలి?

Jan 24 2018 2:12 AM | Updated on Jan 24 2018 2:12 AM

The wild rice is the world hungry? - Sakshi

ఆస్ట్రేలియాలో ఇటీవల గుర్తించిన పురాతన వరి వంగడాలకు అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని, పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయని అంటున్నారు క్వీన్స్‌ల్యాండ్‌ అలయన్స్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ఇన్నోవేషన్‌కు చెందిన శాస్త్రవేత్త రాబర్ట్‌ హెన్రీ. వాతావరణ మార్పుల ప్రభావంతో పంట దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళనలు వినిపిస్తున్న తరుణంలో... కరువు కాటకాలను తట్టుకోవడమే కాకుండా.. ఎక్కువ దిగుబడులు ఇవ్వగల లక్షణాలున్న వరి వంగడాలు ఎంతో ఉపయోగపడతాయన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో హెన్రీ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతంలోని కొన్ని అడవి వరి మొక్కలను పరిశీలించింది.

వీటిల్లో కనీసం రెండింటికి మంచి లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. ఇవి సంప్రదాయ వరి వంగడాలతో సంకరం చేసేందుకు అనువుగా ఉన్నాయని, అగ్గితెగులుతోపాటు, బ్యాక్టీరియల్‌ లీఫ్‌ స్పాట్‌ తెగులును కూడా తట్టుకోగలవని హెన్రీ తెలిపారు. అడవి వంగడాలు మంచి పోషక గుణాలు కలిగి ఉన్నాయని, అమైలోజ్‌ ఎక్కువగా ఉండటం వల్ల తేలికగా జీర్ణం కావడంతోపాటు కడుపు/పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడుతుందని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement