
- ఆచార్య ఎన్.గోపి ‘వృద్ధోపనిషత్’కు హిందీ (ఆర్. శాంతసుందరి), ఇంగ్లిష్(ఎం.శ్రీధర్, అల్లాడి ఉమ) అనువాదాల ఆవిష్కరణ జనవరి 20న సాయంత్రం 5:30కు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. జి.ఎస్.పి. రావు, వోలేటి పార్వతీశం, వి.హర్షవర్ధన్, కిల్లాడ సత్యనారాయణ, మామిడి హరికృష్ణ, సిరిసిల్ల చందన పాల్గొంటారు. నిర్వహణ: కిన్నెర ఆర్ట్ థియేటర్స్.
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఆకాశవాణి నిర్వహించే 22 భాషల సర్వ భాషా కవి సమ్మేళనంలో చదివిన కవితల తెలుగు అనువాదాలను తెలంగాణ, ఆంధ్ర కవులు జనవరి 22న ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్‌లో వినిపిస్తారు. ఈ సమ్మేళనానికి తెలుగు తరఫున ఎంపికైన మామిడి హరికృష్ణతో పాటు కొలకలూరి ఇనాక్, ఎన్.గోపి, కె.శివారెడ్డి, దేవిప్రియ పాల్గొంటారు.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రచన ‘ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యాంతరంగం’ ఆవిష్కరణ జనవరి 22న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నాళేశ్వరం శంకరం, కె. శివారెడ్డి, గురిజాల రామశేషయ్య, పి.సి.రాములు, ఎం.నారాయణశర్మ, సీహెచ్ ఉషారాణి పాల్గొంటారు. నిర్వహణ: పాలపిట్ట బుక్స్.
- జన్నాభట్ల నరసింహప్రసాద్ ‘జన్నాభట్ల కథలు–5’ ఆవిష్కరణ జనవరి 22న త్యాగరాయ గానసభలో జరగనుంది. ముదిగొండ శివప్రసాద్, పొత్తూరి సుబ్బారావు, గుదిబండి వెంకటరెడ్డి, విహారి, రమణ వెలమకన్ని, పెద్దూరి వెంకటదాసు పాల్గొంటారు.
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత వెలువడిన వివిధ రచయితల వ్యాసాల సంకలనం ‘కశ్మీర్:బహిరంగ చెరసాల’ (సంపాదకుడు: ఎస్.ఎ.డేవిడ్) ఆవిష్కరణ జనవరి 24న సా.6 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగనుంది. జహీర్ అలీఖాన్, గౌహర్ జిలానీ, కె.శ్రీనివాస్, కె.శ్రీనివాసరెడ్డి, బి.రమాసుందరి, ఎన్.వేణుగోపాల్ పాల్గొంటారు. నిర్వహణ: మలుపు, ప్రెస్ క్లబ్.
- బొందుగులపాటి సాహితీ పురస్కారానికి 2017, 18, 19లో ప్రచురించిన తెలంగాణ రచయితల జానపద సాహిత్య సంబంధ రచనలను ఆహ్వానిస్తోంది సాహితీ గౌతమి. పురస్కార నగదు 5 వేలు. జనవరి 31లోగా 4 ప్రతులను గాజుల రవీందర్, 8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ 12, కరీంనగర్–505001 చిరునామాకు పంపాలి. ఫోన్: 9848255525