హ్యూమన్‌ కంప్యూటర్‌

Vidya Balan to Play Math genius Shakuntala Devi in her Next Film - Sakshi

బయోపిక్‌లో బాలన్‌

ఎలాంటి మేథమేటిక్స్‌నైనా చిటికెలో సాల్వ్‌ చేయగలనని చాలెంజ్‌ చేస్తున్నారు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. అందులోనూ తాను అరిథ్‌మెటిక్స్‌ ఫేవరెట్‌ అంటున్నారు. విద్యాబాలన్‌ సడన్‌గా లెక్కల వైపు ఎందుకు వెళ్లారనేగా మీ సందేహం? ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి పాత్రలో విద్యాబాలన్‌ నటించబోతున్నారు. గణితశాస్త్త్రంపై ఎన్నో పుస్తకాలు, రచనలు చేసిన శకుంతలాదేవికి ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ అనే పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జీవితం ఆధారంగా ‘లండన్‌ ప్యారిస్‌ న్యూయార్క్‌’ చిత్రదర్శకుడు అనూ మీనన్‌ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. దానిని విక్రమ్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ‘

‘హ్యూమన్‌ కంప్యూటర్‌ శకుంతలాదేవిగా పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకం. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె ఎంతో ఖ్యాతిని గడించారు. ఫెమినిస్ట్‌గా తన గొంతును వినిపించారు’’ అన్నారు విద్యాబాలన్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. శకుంతలాదేవి ఐదేళ్ల వయసులోనే పద్దెనిమిదేళ్ల స్టూడెంట్‌ చేయగలిగిన లెక్కలను సాల్వ్‌ చేసేవారట. గిన్నిస్‌ బుక్‌లో చోటు కూడా సంపాదించారామె. కేవలం మ్యాథమేటిషియన్‌గా మాత్రమే కాదు. ఆస్ట్రాలాజీ, వంటలు, నవలా రచనలు కూడా చేశారామె. ‘ద వరల్డ్‌ ఆఫ్‌ హోమోసెక్సువల్స్‌’ అనే బుక్‌ కూడా రాశారు శకుంతల. 83 ఏళ్ల వయసులో 2013 ఏప్రిల్‌లో శకుంతలాదేవి కన్నుమూశారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top