లడ్డూలు పంచండి

varieties of laddus - Sakshi

మండపాలు వెలుగుతుంటాయి... పూజలు జరుగుతుంటాయి... పిల్లలూ పెద్దలూ అక్కడే చేరి ఉత్సాహంగా ఏకదంతుని స్తుతిస్తూ భజనలు చేస్తుంటారు. పూజతో పాటు ప్రసాదం కూడా ఉండాలి. ఈ లడ్లు చేయండి. దేవుడికి పెట్టండి. నలుగురికీ పంచండి. పండగను సంతోషాలతో నింపండి.

కొబ్బరి లడ్డు
కావలసినవి: తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు; పాలు – అర కప్పు; పంచదార – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడి పప్పులు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నెయ్యి – ఒక టీ స్పూను

తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి
జీడిపప్పు ముక్కలు వేసి, వేయించి తీసి, పక్కన ఉంచాలి
అదే బాణలిలో పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి బాగా కలిపి ఉడికించాలి
మిశ్రమంలో తడి అంతా పోయి, బాగా గట్టిపడ్డాక, ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న నట్స్‌ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి
మిశ్రమం కొద్దిగా చల్లారాక లడ్డూల మాదిరిగా చేతితో గుండ్రంగా చేయాలి
గాలిచొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి
ఇవి రెండు మూడు రోజుల కంటె ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.

బందరు లడ్డు
కావలసినవి: సెనగ పిండి – 300 గ్రా.; బెల్లం – 400 గ్రా.; నీళ్లు – అర కప్పు (బెల్లం పాకం కోసం) ; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి/నూనె – ఒక కప్పు; జీడిపప్పులు  + కిస్‌మిస్‌ – పావు కప్పు
తయారీ:
ఒక వెడల్పాటి పాత్రలో సెన గ పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలిపి పక్కన ఉంచాలి
 పిండి మరీ గట్టిగా, మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి
 స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి/నూనె పోసి కాగనివ్వాలి
 జంతికల పిండిని జంతికల గొట్టలోకి కొద్దికొద్దిగా పెట్టుకుంటూ నెయ్యి/నూనెలోకి జంతికలు చుట్టాలి
 రెండువైపులా బాగా వేగిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి
 ఈ విధంగా మొత్తం పిండిని జంతికలుగా చేసుకుని పక్కన ఉంచాలి
 బాగా చల్లారిన తరవాత జంతికలను చేతితో చిదిపి మిక్సీలో వేసి మెత్తగా పొడిలా అయ్యేవరకు మిక్సీ పట్టాలి
  పిండిని జల్లించుకోవాలి
 మెత్తగా ఉన్న పిండిని మాత్రమే వాడుకోవాలి
 జల్లెడలో మిగిలిన పిండిని రెండు మూడు సార్లు మిక్సీలో పడితే చాలావరకు మెత్తగా వస్తుంది
 జల్లెడలో కొద్దిగా మాత్రమే మిగులుతుంది
 ఇలా తయారుచేసుకున్న పిండిని పక్కన ఉంచాలి
 ఒక మందపాటి పాత్రలో బెల్లం, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి కొద్దిగా ఉండపాకం వచ్చేవరకు ఉడికించాలి
 ఉడుకుతుండగానే ఏలకుల పొడి వేసి బాగా కలపాలి
 ఉండ పాకం రాగానే పక్కన  ఉంచుకున్న జంతికల పిండిని కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలిపి దింపేయాలి
 ఈలోపుగా స్టౌ మీద మరో బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి వేయించి పక్కన ఉంచాలి
♦  పిండిని పాకంలో బాగా తిప్పుతూ ఉండాలి
 (ఇంట్లో రోలు, రోకలిబండ ఉన్నవారు రోట్లో వేసి తొక్కాలి) మిశ్రమం గట్టిపడుతుండగా, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి మరోమారు కలిపి, మిశ్రమం చల్లారకుండా, వేడిగా ఉండగానే గబగబ లడ్డూలుగా గుండ్రంగా చేయాలి
 (ఆలస్యం అయితే మిశ్రమం పొడిపొడిలా అయిపోయి, ఉండలు చేయడానికి కుదరదు)
♦  లడ్డూలు చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి
 ఇవి కనీసం నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి.

డేట్స్‌ మావా లడ్డు
కావలసినవి: ఖర్జూరాలు – 300 గ్రా. (గింజలు తీసినవి); పచ్చి కోవా – 200 గ్రా.; నెయ్యి – ఒక టీస్పూను; న ట్స్‌ – కొద్దిగా (బాదం పప్పులు, పిస్తా, జీడి పప్పుల తరుగు); రోజ్‌ వాటర్‌ – ఒక టీ స్పూను
తయారీ:
  ఖర్జూరాలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. (ఖర్జూరాలు కొద్దిగా గట్టిగా అనిపిస్తే, కొద్దిగా పాలలో నానబెట్టిన తరవాత మిక్సీలో వేయాలి)
  స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి
 మెత్తగా చేసుకున్న ఖర్జూరాలు, పచ్చికోవా వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి
♦  బాణలి అంచులను విడిచిపెడుతున్నట్లుగా అయ్యేవరకు ఉడికించాక రోజ్‌వాటర్‌ జతచేసి మరోమారు కలపాలి
  మిశ్రమం ముద్దలా అయిన తరవాత దింపేసి, నెయ్యి పూసిన ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
 నట్స్‌ జత చేయాలి
  కొద్దిగా చల్లబడిన తరవాత లడ్డూల మాదిరిగా గుండ్రంగా చేసుకోవాలి
 ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అందువల్ల ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.

వాల్నట్‌ లడ్డు
కావలసినవి: వాల్నట్స్‌ – ఒక కప్పు (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి); అటుకులు – ఒక కప్పు; తాటి బెల్లం పొyì / బెల్లం పొడి∙– ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను.
తయారీ:
స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక అటుకులు వేసి దోరగా వేయించి తీసేయాలి
 అదే బాణలిలో వాల్నట్స్‌ వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి
 అటుకులు చల్లారిన తరవాత చేతితో పొడిలా చేయాలి
వాల్నట్స్‌ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
 బెల్లం కూడా జత చేసి మరోమారు మిక్సీ పట్టాక, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
 అటుకుల పొడి జత చేసి బాగా కలిపి, చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూలు తయారుచేయాలి
 వాల్నట్స్‌ లడ్డూలు సిద్ధమైనట్లే.

మలడు లడ్డు
కావలసినవి: పుట్నాల పప్పు – ఒక కప్పు; పంచదార – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడిపప్పులు – గుప్పెడు
తయారీ:
 పుట్నాలపప్పు (వేయించిన సెనగ పప్పు) మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి
పంచదార, ఏలకులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
 స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక జీడిపప్పులు వేసి వేయించి, మంట ఆర్పేయాలి
పంచదార పొడి, పుట్నాల పప్పు పొడి వేడివేడి నేతిలో వేసి బాగా కలపాలి
 వేడి బాగా తగ్గేవరకు పక్కన ఉంచాలి
(పూర్తిగా చల్లారనివ్వకూడదు)
 గోరువెచ్చగా ఉన్న సమయంలోనే కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూ ఉండలు చేసి పక్కన ఉంచాలి
 చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

కండెన్స్‌డ్‌ మిల్క్‌ కోకోనట్‌ లడ్డు
కావలసినవి : కండెన్స్‌డ్‌ మిల్క్‌ – అర కప్పు + 2 టేబుల్‌స్పూన్ల స్వీట్‌ కండెన్స్‌డ్‌ మిల్క్‌; ఏలకుల పొడి – చిటికెడు; వేయించిన నట్స్‌ – కొద్దిగా (పిస్తా పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ కలిపి); పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు (బాగా మెత్తగా ఉండాలి)

తయారీ
ఒక పాత్రలో పచ్చి కొబ్బరి తురుము, కండెన్స్‌డ్‌ మిల్క్‌ + స్వీట్‌ కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి కలుపుతుండాలి
  మిశ్రమం బాగా ఉడుకుపట్టి, దగ్గర పడిన తరవాత ఏలకుల పొడి, నట్స్‌ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి
 కొద్దిగా చల్లారిన తరవాత లడ్డూల మాదిరిగా చేసుకుని గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.

మలై లడ్డు
కావలసినవి: పాలు – 2 లీటర్లు (8 కప్పులు); పంచదార – అర కప్పు; నిమ్మ రసం – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – చిటికెడు; కుంకుమ పువ్వు – చిటికెడు; జీడి పప్పులు – తగినన్ని; కిస్‌మిస్‌ – తగినన్ని

తయారీ:
 ఒక పెద్ద పాత్రలో పాలు పోసి మీగడ పొర వచ్చేవరకు పాలను కాచి, స్టౌ మీద నుంచి దింపేయాలి
రెండు కప్పుల పాలు, మీగడ వేరే పాత్రలోకి తీసుకోవాలి
 మిగిలిన ఆరు కప్పుల పాలలో నిమ్మ రసం వేసి పాలను విరగ్గొట్టాలి
 పాల విరుగును ఒక పల్చటి వస్త్రంలో వేసి మూట గట్టి, నిమ్మరసం పోయేవరకు చన్నీళ్లలో కడగాలి
 నీరంతా పోయేవరకు గట్టిగా పిండాలి
 పనీర్‌ రెడీ అయినట్లే ∙పక్కన ఉంచుకున్న రెండు కప్పుల పాలకు పంచదార జత చేసి స్టౌ మీద ఉంచి అర కప్పు పాలు మిగిలే వరకు మరిగించాలి
తయారు చేసి ఉంచుకున్న పనీర్‌ వేసి బాగా కలపాలి
 మిశ్రమం బాగా చిక్కపడేవరకు కలుపుతుండాలి
  ఏలకుల పొడి పంచదార మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి
 లడ్డూ మౌల్డ్‌కి కొద్దిగా నెయ్యి పూసి, తగినంత మలై లడ్డూ మిశ్రమం అందులో ఉంచి మూసేయాలి
¯ð మ్మదిగా తెరిచి లడ్డూ ఆకారం చెyì పోకుండా జాగ్రత్తగా బయటకు తీసి ఒక ప్లేట్‌లో ఉంచాలి
ఈ విధంగా లడ్డూలన్నీ తయారుచేసుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు
అందువల్ల ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి.

తంబిట్టు
కావలసినవి: పుట్నాల పప్పు – ఒక కప్పు (పొడి చేయాలి); బెల్లం పొడి – అర కప్పు; నెయ్యి – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – 3 టేబుల్‌ స్పూన్లు; వేయించిన నువ్వులు – 3 టేబుల్‌ స్పూన్లు (పొడి చేయాలి); వేయించిన పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్లు (పొడి చేయాలి); గసగసాలు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: వెడల్పాటి పాత్రను స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి
బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి
బెల్లం పూర్తిగా కరిగి, పొంగులు వస్తుండగా ఏలకుల పొడి, పుట్నాల పొడి (2 టేబుల్‌ స్పూన్ల పొడి పక్కన ఉంచాలి)
కొబ్బరి తురుము, నువ్వుల పొడి, గసగసాలు, పల్లీల పొడి వేసి బాగా కలపాలి
బెల్లం పాకంలో బాగా కలిసేవరకు కలుపుతుండాలి
పల్చగా అనిపిస్తే, పక్కన ఉంచుకున్న పుట్నాల పొడి జత చేసి మరోమారు కలపాలి
మిశ్రమం కొద్దిగా చల్లారిన తరవాత, చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, పుట్నాల పొడి మిశ్రమం కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూలు చేయాలి
(మరీ ఆలస్యం చేస్తే లడ్డూ చేయడానికి రాదు)
వారం రోజుల కంటె ఎక్కువ రోజులు నిల్వ ఉండదు
ఈ లడ్డూలను కర్ణాటక రాష్ట్రంలో గౌరీ పూజ, వినాయక పూజ వంటి సందర్భాలలో ప్రత్యేకంగా తయారుచేస్తారు.

ఆటా లడ్డు
కావలసినవి : గోధుమ పిండి – 2 కప్పులు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కిస్‌మిస్‌ – తగినన్ని; జీడి పప్పులు – తగినన్ని

తయారీ
 స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి
జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి
 బాణలిలో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగాక గోధుమ పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, తీసి పక్కన ఉంచి చల్లారనివ్వాలి
మిక్సీలో పంచదార, ఏలకులు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి
 ఒక పాత్రలో ఈ పదార్థాలన్నిటినీ వేసి బాగా కలపాలి
 కొద్దికొద్దిగా నెయ్యి, వేయించి∙ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి లడ్డూలు చేసుకోవాలి
 గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి
ఈ లడ్డూలు చిన్న పిల్లలకు మంచిది అనారోగ్యం, అజీర్తి చేయకుండా ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top