దీపావళికి పట్టు జార్జెట్టు

Try New Design Sarees For Diwali Festival - Sakshi

ఇది మెరిసే పండగ.మగువలూ మెరిసే పండగ. వాకిలిలో దీపాలు వెలుగుతాయి. వాకిలి లోపల గృహిణి కళ కళకళలాడుతుంది. ఈ దీపావళికి కొత్త డిజైన్‌ని ట్రై చేయండి. జార్జెట్‌ చీరకు పట్టు అంచును జతచేయండి. ఆ కట్టుతో ఆకట్టుకోండి.

అందరికీ సూటబుల్‌
బెనారస్‌ పట్టు మంచి కాంతిమంతమైన రంగులతో, డిజైన్‌తో ఇట్టే ఆకట్టుకుంటుంది. పండగలకు, పెళ్లిళ్లకు బెనారస్‌ పట్టు చీరలను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. అలాగే జార్జెట్‌ చీరలను అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ఈ రెంటినీ ఇష్టపడేలా కాంబినేషన్‌ చీరను డిజైన్‌ చేశాం. సంప్రదాయ పండగలు, వివాహ వేడుకలకు కొత్త కళ తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈ జార్జెట్‌ బెనారస్‌ పట్టుల కాంబినేషన్‌. టీనేజర్ల దగ్గర నుంచి అన్ని వయసుల వారూ వీటిని కట్టుకోవచ్చు. వేడుకలలో బ్రైట్‌గా వెలిగిపోవచ్చు.

►హెవీగా కాకుండా బెనారస్‌ను అంచు, బుటీలుగా తీసుకున్నారు.
►పాతకాలం అంటే నలభై యాభై ఏళ్ల క్రితం అమ్మలకు ఇలాంటి బ్రైట్‌ డిజైన్‌ ఉన్నకలర్‌ కాంబినేషన్‌ చీరలు ఉండేవి. ఆ డిజైన్‌ వచ్చేలా వీటిని డిజైన్‌ చేశారు.
►ఈ చీరలకు ఎలాంటి బ్లౌజ్‌ వేసినా బాగా నప్పుతుంది. అంటే చీర రంగులోనే ఉండే సెల్ఫ్‌ బ్లౌజ్‌ అయినా, ఏ డిజైనర్‌ బ్లౌజ్‌ అయినా వేసుకోవచ్చు.
►ఈ చీరలన్నింటికీ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్‌ బ్లౌజ్‌లను వాడారు.
►కేశాలంకరణ, ఆభరణాలు సింపుల్‌గా ఉన్నా కాస్త హెవీగా ఉన్నా ఈ చీరలకు నప్పుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top