గీత స్మరణం | Today song jenns | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Jan 2 2014 12:56 AM | Updated on Sep 2 2017 2:11 AM

గీత స్మరణం

గీత స్మరణం

పాపమ పనిపమ పనిపమ గమపా సగసని పనిపమ గమగసగమపా

 పల్లవి :
 పాపమ పనిపమ పనిపమ గమపా
 సగసని పనిపమ గమగసగమపా
 ॥
 తకడ తకడ తక ధిమ్     (2)
 తకడ త కడతక ధిమ్ తక ఝం
 ॥
 కన్నులతో చూసేవీ గురువా
 కనులకు సొంతమౌనా...
   కనులకు సొంతమౌనా
 కన్నుల్లో కనుపాపై నీవు
   కన్ను విడిపోలేవూ...
   ఇక నను విడిపోలేవూ
 ॥
 చరణం : 1
 జలజల జలజల జంట పదాలు
 గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే
   తెలుగులో ఉన్నవిలే
 విడదీయుటయే న్యాయం కాదు
   విడదీసేస్తే వివరం లేదు
 రెండేలే రెండు ఒకటేలే
 ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్‌తాని తొందిరతాని దినతోం         (2)
 రేయీ పగలు రెండైనా
   రోజు మాత్రం ఒకటేలే
 కాళ్లు ఉన్నవి రెండైనా
   పయనం మాత్రం ఒకటేలే
 హృదయాలన్నవి రెండైనా
    ప్రేమ మాత్రం ఒకటేలే
 ॥
 చరణం : 2
 క్రౌంచ పక్షులు జంటగ పుట్టును
 జీవితమంతా జతగా బ్రతుకును విడలేవూ
   వీడిమనలేవూ
 కన్ను కన్ను జంటగ పుట్టును
   ఒకటేడిస్తే రెండోదోదార్చును
   పొంగేనా ప్రేమే చిందేనా
 ॥
 ఒక్కరు పోయే నిద్దురలో
   ఇద్దరి కలలను కంటున్నాం
 ఒక్కరు పీల్చే శ్వాసలలో
   ఇద్దరి జీవనమంటున్నాం
 తాళికొరకు మాత్రమే
   విడివిడిగా వెతుకుతున్నాం
 ॥
 మమగగ మమసస గగసస గగనిని సగగ
   సమమ సగగ సపప
 సగగ సనిని సగసస సానిదపమగా
 గమపని సగా రిసా
   సానిదపామగారీ సగమ
 ॥
 పపనినిసాస గగమమ పపనిని సాస
 నిసగమపని దపమా గామ పని సగరిద
 నిసమగరిసనిద
 ॥
 రీరీ సనిస రిరిస సరిరినిని
   సాస గరిస నిసగరిసని
 దప పాప నిదప మగసరి
   నిసగా సగమ గమపా
 నిదపప మపనీ పపని సగరిస
 గరిసని సానిదపామా గమపమ
 ॥
 చిత్రం : జీన్స్ (1998)
 రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్
 సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
 గానం : నిత్యశ్రీ
 
 
 నిర్వహణ: నాగేశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement