అతిభారీ క్యాబేజీ | The large cabbage | Sakshi
Sakshi News home page

అతిభారీ క్యాబేజీ

Mar 8 2016 11:22 PM | Updated on Apr 4 2019 5:04 PM

అతిభారీ క్యాబేజీ - Sakshi

అతిభారీ క్యాబేజీ

ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వినియోగంలో ఉన్న క్యాబేజీ సాధారణంగా దోసిట్లో ఇమిడిపోయే పరిమాణంలో ఉంటుంది.

తిక్క  లెక్క

ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వినియోగంలో ఉన్న క్యాబేజీ సాధారణంగా దోసిట్లో ఇమిడిపోయే పరిమాణంలో ఉంటుంది. ఎంత పెద్దగా ఉన్న క్యాబేజీ అయినా రెండు మూడు కిలోల వరకు తూగుతుందేమో! ఈ ఫొటోలో ఉన్న క్యాబేజీ మాత్రం దాదాపు ఒక మనిషి బరువంత తూగి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టింది.

అమెరికాలో పండిన ఈ క్యాబేజీ బరువు 62.71 కిలోలు. అలాస్కా రాష్ట్రంలోని పామేర్ ప్రాంతంలో స్కాట్ ఏ రాబ్ అనే రైతు పొలంలో పండింది ఇది. అతి భారీ కూరగాయలను పండించడంలో ఈ రైతు పేరిట ఇప్పటికే చాలా రికార్డులు ఉండటం విశేషం.

 

Advertisement
 
Advertisement
Advertisement